మాతో ఆడండి ప్లీజ్ .. బీసీసీఐకి బంగ్లా క్రికెట్ బోర్డు లేఖ
Publish Date:Apr 4, 2026
Advertisement
బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశానికి భారత్‌కు మధ్య దూరం పెరిగింది. ఆ రాజకీయ వైరుధ్యం క్రీడలకు కూడా పాకింది. భారత్‌తో దూరం పాటించాలనే నాయకుల సూచనలతో గత టీ 20 ప్రపంచకప్‌నకు కూడా బంగ్లాదేశ్ దూరమైంది. ఐపీఎల్‌లో కూడా బంగ్లా జట్టు ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ వైఖరి మారింది. బీసీసీఐ సహకారం కోరుతూ బంగ్లా క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ నజ్ముల్ అబేదిన్ తాజాగా ఓ లేఖ రాశారు. మేం బీసీసీఐకి రాసిన లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించాం. బంగ్లాకు సహకారం అందించే అవకాశాలను పరిశీలించమని విజ్ఞప్తి చేశాం. సెప్టెంబర్‌లో బంగ్లా పర్యటనకు టీమిండియాను పంపించాలని కోరాం. అలాగే షెడ్యూల్ ప్రకారం భారత్‌కు మా జట్టు వెళ్లాల్సి ఉంది' అని అబేదిన్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది . ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ నెల 6,7 తేదీలలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ద్వైపాక్షిక సంబంధాలతో పాటు క్రికెట్ సహకారంపై కూడా మాట్లాడబోతున్నట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/bangladesh-cricket-board-letter-to-india-36-216678.html
The role or involvement of al Qaeda in the attack
Nearly two years after President Barack Obama ordered 33,000
సైనా నెహ్వాల్ మేనేజింగ్ కంపెనీ రీతీ స్పోర్ట్స్‌తో రూ. 40 కోట్ల విలువ చేసే డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సైనా నెహ్వాల్ సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు పొందుతుంది. ఇంతకు ముందు సైనా నెహ్వాల్ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు పొందేది. ఈ డీల్ కుదరటంతో తను ఎంతో థ్రిల్ అయ్యానని, ఇంత త్వరగా పెద్ద అవకాశం లభిస్తుందని అనుకోలేదని సైనా చెప్పింది.





