కాల్వలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి..!
Publish Date:Aug 10, 2026
Advertisement
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ప్రయాణిస్తున్న మినీ వ్యాన్.. అదుపుతప్పి పొంగిపొర్లుతున్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మరో ఇద్దరి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలతో కాల్వలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఇదే సమయంలో వేగంగా వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి నేరుగా వరద ప్రవాహంలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే వాహనం నీటిలో మునిగి కొట్టుకుపోయింది. వాహనంలో ఉన్న ప్రయాణికులు బయటపడేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఉధృతమైన నీటి ప్రవాహం కారణంగా అది సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురైనా.. సిబ్బంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నీటి ప్రవాహానికి వ్యాన్ కొంతదూరం కొట్టుకుపోవడంతో మృతదేహాలను వెలికితీయడం సవాల్‌గా మారింది. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా.. రోడ్డుపై పరిస్థితులా.. లేక వరద ప్రవాహాన్ని అంచనా వేయడంలో జరిగిన పొరపాటా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు అధికారులు సానుభూతి తెలిపారు. భారీ వర్షాల సమయంలో కాల్వలు, వాగులు, బ్రిడ్జిలపై వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. ప్రమాదకర ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.
Rajgarh Accident, Madhya Pradesh Accident, Rajgarh Van Accident, Van Swept Away, Flood Water,
Heavy Rains, 11 Passengers, Flood Accident
http://www.teluguone.com/news/content/rajgarh-accident-36-228568.html
The role or involvement of al Qaeda in the attack
Nearly two years after President Barack Obama ordered 33,000
సైనా నెహ్వాల్ మేనేజింగ్ కంపెనీ రీతీ స్పోర్ట్స్‌తో రూ. 40 కోట్ల విలువ చేసే డీల్‌ను కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో సైనా నెహ్వాల్ సంవత్సరానికి 14 కోట్ల రూపాయలు పొందుతుంది. ఇంతకు ముందు సైనా నెహ్వాల్ ఏడాదికి 1.5 కోట్ల రూపాయలు పొందేది. ఈ డీల్ కుదరటంతో తను ఎంతో థ్రిల్ అయ్యానని, ఇంత త్వరగా పెద్ద అవకాశం లభిస్తుందని అనుకోలేదని సైనా చెప్పింది.





