వరుణ్ వస్తానన్నా రాహుల్ వద్దంటారా!

Publish Date:Jan 18, 2023

Advertisement

తమ్ముడు తమ్ముడే పేకాట,పేకాటే..ఇది అందరికీ తెలిసిన నానుడి. అంటే, అన్నదమ్ముల అనుబంధాలు, రక్త సంబంధాలు వ్యాపార వ్యవహారాలో పని చేయవని చెప్పే సందర్భంలో ఈ నానుడిని వాడుతుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ నానుడిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీలలో ఉండి ఒకరిపై ఒకరు పోటీ చేయవలసి వచ్చినప్పడు లేదా అన్నదమ్ములు, మంచి మిత్రులు ఒకరిపై ఒకరు పోటీ చేసినప్పుడు, కూడా ఇలాంటి వాఖ్యలే వినిపిస్తుంటాయి.

ఇప్పడు అది యాధృచ్ఛికమే కావచ్చును కానీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరుడు ( కజిన్) బీజేపీ ఎంపీ  వరుణ్ గాంధీ (సంజయ్ గాంధీ, మేనకా గాంధీ కుమారుడు) గురించి ఇంచు మించుగా అలాంటి అర్థం వచ్చే వ్యాఖ్యలే చేశారు. నిజానికి, వరుణ్ గాంధీ తండ్రి సంజయ్ గాంధీ ఆకస్మిక అనుమానస్పద మృతి తర్వాత, మేనకా గాంధీ, అత్తింటిని వదిలి వచ్చారు. ఆ తర్వాత, ఆ రెండు  కుటుంబాల మధ్య పెద్దగా సంబంధాలులేవు. గాంధీ నెహ్రూల కుటుంబం నుంచి బయటకు వచ్చిన మేనకా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు.  బీజేపీలో చేరారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి బాటలో వరుణ్ గాంధీ కూడా బీజేపీలో చేరారు.  ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ నుంచి వరసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే చాల కాలంగా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి. 

అయితే, అదెలా ఉన్నా, ఇప్పడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రవచించే హిందూ జాతీయ వాదానికి వ్యతిరేకంగా  భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ తమ సోదరుడు వరుణ్ గాంధీతో తమ సంబంధాలు అంతవరకే పరిమితమని, రాజకీయంగా ఎవరి దారి వారిదే’ అని స్పష్తం చేశారు.  పంజాబ్ గుండా సాగుతున్నా భారత్ జోడో యాత్రలో భాగంగా  మంగళవారం (జనవరి 17) నిర్వహించిన ప్రెస్ మీట్లో సోదరుడు వరుణ్ గాంధీతో సంబంధాలపై స్పందించారు. తమకు రెండు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయని, తమ్ముడు స్వీకరించిన సిద్ధాంతాన్ని తాను అంగీకరించలేనని అన్నారు.  నేను  కావాలంటే వరుణ్ ను కలవగలను, కౌగలించుకోగలను,  కానీ నేను ఆ భావజాలాన్ని అంగీకరించలేను  అని రాహుల్ తేల్చి చెప్పేశారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని, ఆయన భారత్ జోడో యాత్రలో నడిస్తే అది అతనికి సమస్య కావచ్చని రాహుల్ గాంధీ పరోక్షంగానే అయినా వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని చెప్పకనే చెప్పారు.

అయితే, అందుకు ఆయన భావజాల సంఘర్షణను కారణంగా చూపినా అసలు కారణం వేరే ఉందని అంటారు. సోనియా, మేనక గాంధీల మధ్య మొదటి నుంచి కూడా సత్సంబంధాలు లేవని, అంటారు. అయితే ఆ విషయాన్ని కప్పి పెట్టి రాహుల్ గాంధీ,  తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్ ) కార్యాలయానికి ఎప్పటికీ వెళ్ళలేనని రాహల్ తెలిపారు. అలా వెళ్లవలసి వస్తే తన తల నరుక్కోవాల్సి వస్తుందన్నారు. తన కుటుంబానికి ఓ సిద్దాంతం ఉందని  ఏదో ఒక సమయంలో, ఇప్పుడు కూడా వరుణ్ దానికి భిన్నమైన దానికి స్వీకరించాడని, తాను ఆ భావజాలాన్ని అంగీకరించలేనని, తమ్ముడు తమ్ముడే పేకాటే  అని చెప్పు కొచ్చారు.

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
​కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నికల కౌంటింగ్‌లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.