కమల దళంలో ముసలం మోడీ తీరు పట్ల అసంతృప్తి.. మోడీ మూడోసారి డౌటే

Publish Date:Jun 8, 2022

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరుగులేని నాయకుడు, ఎనిమిదేళ్ళ పాలన తర్వాత కూడా దేశంలో మోడీకి సరి జోడీ మరొకరు కనిపించడం లేదు. ఇది చాలా మందిలో ఉన్న ప్రస్తుతఅభిప్రాయం. అలాగే, పార్టీలో ప్రభుత్వంలో అయన మాటకు ఎదురుండదు. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో మోడీ, షా జోడీదే హావా. ఆ ఇద్దరు ఏ నిర్ణయం తీసుకుంటే, అదే ఫైనల్..నిజమే,కొంచెం అతిశయోక్తిగా అనిపించినా ఇదే నిజం.ముఖ్యంగా, 2019లో రెండవ సారి, 303 మంది సభ్యుల సొంత సంఖ్యాబలంతో అధికారంలోకి వచ్చిన తర్వాత, పార్టీలో, ప్రభుత్వంలో ఆ ఇద్దరే హీరోలు .. మిగిలిన అందరూ జీరోలు, అనే అభిప్రాయం మరింతగా బలపడింది. బీజేపీ అంటే మోడీ, బీజేపీ అంటే అమిత్ షా, ప్రభుత్వంలోనూ ఆ ఇద్దరు చెప్పిందే వేదం, ఎంత మంది సీనియర్ మంత్రులు ఉన్నా, ఆ ఇద్దరు చేసిందే శాసనం, అనే ఒక బలమైన  పర్సెప్షన్ అయితే ఏర్పడింది. సహజంగానే అది సీనియర్లలో అసంతృప్తిని రగిల్చింది. 

నిజమే ఒకప్పుడు, కాంగ్రెస్ లో ఇందిరా గాంధీ ఇలాగే, ఓ వెలుగు వెలిగారు  1969లో సీనియర్ నాయకులు అందరినీ పక్కకు నెట్టి, ఇందిరాగాంధీ పార్టీని రెండు ముక్కలు చేశారు. అయినా 1971 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో, ఇందిరా గాంధీ, 353 సీట్లతో తిరుగులేని శక్తిగా, ఎదురు లేని నాయకురాలుగా నిలిచారు. ఈ నేపధ్యంలోనే పార్టీ నాయకుడు దేవకాంత్ బారువా ఇందిరా గాంధీని పొగడ్తలతో ముంచెత్తారు. ఏకంగా, ‘ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా’ అని ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు, మోడీ షా జోడీ కూడా అలానే పార్టీని, ప్రభుత్వాన్ని తమ గుప్పిటలో  పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు.  
అయితే, ఇప్పుడు ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో కూడా, మోడీ షా జోడీకి ప్రతిఘటన మొదలైందని తెలుస్తోంది. నిరసన సెగ ఆ ఇద్దరినీ గట్టిగా తాకుతోందని, పార్టీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అది కూడా నాగపూర్ సెగ అంటున్నారు.  పార్టీ సర్వోన్నత విధాన నిర్ణాయక కమిటి, పార్లమెంటరీ బోర్డును నిర్వీర్యం చేసి, ముఖ్యమంత్రుల నియామకం వంటి కీలక నిర్ణయాలను ఆ ఇద్దరే, (మోడీ, షా జోడీ)  తీసుకోవడం, ఏమిటనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది.అదే విధంగా, పార్టీతో సంఘ్ పరివార్ సంస్థలతో సంప్రదించకుండా, హిదుత్వ వాదానికి కట్టుబడిన, పార్టీ అధికార ప్రతి నిథి నూపూర్ ‘ ను సస్పెండ్ చేయడం వంటి నిర్ణయాలు నాగపూర్ కు రుచించడం లేదని అంటున్నారు. 

ఈ నేపద్యంలో, పార్టీ సీనియర్ నాయకుడొకరు, గడచిన రెండు సంవత్సరాలలో, పార్లమెంటరీ బోర్డు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, అయినా, నాలుగైదు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను మార్చారు. ఇటీవల ఎన్నికలు జరిగిన  ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్  రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులనే కొనసాగించాలననే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు? పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్న అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్ చనిపోయారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఎన్నికై రాజకీయ క్షేత్రం నుంచి తప్పుకున్నారు అలాగే గడచిన ఐదేళ్లలో ఇంకొన్ని ఖాళీలు కూడా ఏర్పడ్డాయి. బోర్డ్ సభ్యుల సంఖ్య ఇంచు మించుగా సగానికి తగ్గి పోయింది. ముఖ్యంగా ప్రశ్నించే వారు లేకుండా పోయారు. ఒక్క  గడ్గరీ మినహా మరొకరు గొంతు వినిపించే పరిస్థితి లేదు. అయినా ఖాళీలు భర్తీ  చేయలేదు. చివరకు పార్టీ రాజ్యాంగం అత్యున్నత నిర్ణాయక కమిటీగా పేర్కొన్న, పార్లమెంటరీ బోర్డును, కేవలం కాగితాలకు పరిమితం చేశారు, అంటూ ఆగ్రహం వ్యక్త పరిచారు.

ఇదలా ఉంటే, ఇటీవల మూడో సారీ, మళ్ళీ నేనే, అంటూ ప్రధాని మోడీ ప్రకటించిన నేపధ్యంలో, పార్టీలో, సంఘ పరివార్’ లో లుకలుకలు మొదలయ్యాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  నాగపూర్’కు ఫిర్యాదులు చేరాయి. కొదరు పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీలు, పార్టీలో వ్యక్తీ ఆరాధన ఎక్కువుతున్న తీరును, ఆ ఇద్దరు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వలన పార్టీకి జరుగతున్న నష్టాన్ని నేరుగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ దృష్టికి తీసుకెళ్ళారని తెలుస్తోందని అంటున్నారు. ఆ ఇద్దరిని కట్టడి చేయక పోతే. 2024 ఎన్నికలలో పార్టీకి ఓటమి  తప్పదని, సుమారు 150కి పైగా ఎంపీల సంతకాలతో కూడిన నివేదిక  మోహన్ భగవత్’కు చేరిందని సమాచారం.

ఇందులో ప్రధానంగా పెట్రోల్, డీజిల్ సహా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సమస్యలను పట్టించుకోక పోవడం వంటి కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.అలాగే, మిత్ర పక్షాలను, ముఖ్యంగా శివసేన వంటి మిత్ర పక్షాలను దూరం   చేసుకోవడం, ఆ పార్టీ నేతలను వేధింపులకు గురిచేయడం, ప్రాంతీయ పార్టీలతో కయ్యానికి కలుదువ్వడం వంటి విషయాలను కూడా ఆర్ఎస్ఎస్ అధినేత దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం. 
ఈ నేపధ్యంలోనే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ అధినేత ఆదేశాల మేరకు, సీనియర్ మంత్రులు, కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో, సీనియర్ మంత్రులు రాజనాథ్ సింగ్, నితిన్ గడ్గరీ ప్రధాని మోడీ వ్యవహార శైలిని ప్రశ్నించడం తో పాటుగా తీరు మార్చుకోక పొతే, 2024 ఎన్నికలలో గట్టెక్కడం కష్టమని గట్టిగా హెచ్చరించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా గడ్గరీ, ప్రధాని మోడీ మధ్య వాగ్వివాదం సైతం చోటు  చేసుకుందని, ఆ సమయంలో మోడీ ‘ఎన్నికలలో ఎలా గెలవాలో , ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు తెలుసునని, ఎవరూ చెప్పవలసిన అవసరం లేదని అసహనాన్ని ప్రదర్శించారు. అలాగే ఎంపీలు అందరూ తనతోనే ఉన్నారని అన్నారు,

దీంతో గడ్గరీ 150 మంది ఎంపీలు సంతకాలతో నాగపూర్’కు పంపిన నివేదికను మోడీ ముందు పెట్టినట్లు సమాచారం.ఆ తర్వాతనే మోడీ, పెట్రోల్, డీజిల్’పై ఎక్సైజ్’ డ్యూటీ భారీగా తగ్గించడం,ఎరువుల సబ్సిడీ పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే, మిత్రపక్షాల విషయంలోనూ పునరాలోచన చేస్తునట్లు తెలుస్తోంది. అయితే, ముడో సారీ నేనే. అంటూ మోడీ చేసిన ప్రకటన సృష్టించిన ప్రకంపనలు అంత తేలిగ్గా చల్లారవని, ముఖ్యంగా ప్రధాని పదవిని ఆశిస్తున్న, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్న గడ్గరీ, ఈసారి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్డమయ్యారని అంటున్నారు.

అయితే, అదే సమయంలో మోడీ షా జోడీ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేమని, కమల దళంలో విరిసిన ‘ముసలం’ ఏమి చేస్తుందో, ఎటుగా  సాగుతుందో చూడవలసిందే కానే చెప్పలేమని, పార్టీ నేతలు, పరిశీలకులు అంటున్నారు. అయితే,  బీజేపీ  అంతా బాగుందని, మోడీ షా జోడీకి తిరుగు లేదని, అనుకునే పరిస్థితి  అయితే లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని, పార్టీ నాయకులే అంగీకరించడం ... ఈ కథకు కొసమెరపు.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.