దామచర్ల, బాలినేనికి తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ వార్నింగ్.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ఒంగోలులో దామచర్ల, బాలినేని వ్యవహారంపై ఇటు తెలుగుదేశం, అటు జనసేన హైకమాండ్ సీరియస్ అయ్యాయి. తెలుగుదేశం హైకమాండ్ దామచర్లకు, జనసేన అధిష్ఠానం బాలినేనికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.    మాజీ మంత్రి, జనసేన నాయకుడు   బాలినేని శ్రీనివాసరెడ్డి,   తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ల నడుమ గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి.  తాజాగా ఈ ఇరువురు నేతలూ పరస్పరం అవినీతి ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడటం సంచలనం రేపింది.  

ఈ ఇద్దరు కీలక నేతల   వైరం   కూటమి ప్రతిష్టకు భంగం కలిగించేలా మారడంతో తెలుగుదేశం, జనసేన పార్టీలహై కమాండ్ లు  ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై  అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి.  ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దామచర్ల, బాలినేని వ్యహార శైలిపై తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఉమ్మడి సమన్వయ కమిటీ నేతలు  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కూటమి భాగస్వామ్య పక్షాలుగా కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయంలో, నేతలు ఇలా   పరస్పరం విమర్శలూ, దూషణలతో  రోడ్డెక్కడం ఏమాత్రం సరికాదని కమిటీ పేర్కొంది.   నేతల మధ్య  విబేధాలు, సమస్యలు   ఉంటే వాటిని పార్టీల అంతర్గత వేదికలపై  మాట్లాడటంలేదా,  అధిష్టానం దృష్టి తీసుకురావడం చేయాలే తప్ప..  మీడియా  ఎదుటకు వచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం కరెక్ట్ కాదనీ, కూటమి ఐక్యతకు ఇది భంగం కలిగిస్తుందనీ కమిటీ దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డిలను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది.  ఈ వివాదానికి వెంటనే స్వస్తి పలకాలని,   ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని  ఇరువురికీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.  

ఇరు వర్గాలు రోడ్డెక్కి బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులలో తీవ్ర అయోమయం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇటువంటి వర్గపోరు, ఆధిపత్య పోరాటాలు తెరపైకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడమే కాకుండా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రెండు పార్టీల అగ్రనాయకత్వాలు భావించాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఇది రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన హైకమాండ్, ఈ వ్యవహారాన్ని మరింత ముదరకుండా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. కూటమిలో ఏ చిన్నపాటి విభేదాలు వచ్చినా స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలి లేదా సమన్వయ కమిటీల దృష్టికి తీసుకురావాలి తప్ప, మీడియాని వేదికగా చేసుకుని పరస్పర బురదజల్లుడు కార్యక్రమాలు చేపడితే ఎవరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టమైన సందేశాన్ని పంపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు రాజకీయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ సీరియస్ హెచ్చరికల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్ధన్ తమ విమర్శల దాడిని నిలిపివేసి సంయమనం పాటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ, ఇరువర్గాల కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఈ ఇద్దరు నేతలకు పెద్ద పరీక్షగా మారనుంది. ఒకవేళ అధిష్టానం ఆదేశాలను తుచ్ఛంగా భావించి మళ్లీ బహిరంగ విమర్శలకు దిగితే, పార్టీల నాయకత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇటువంటి అనవసర వివాదాలు పక్కనబెట్టి ఐక్యంగా పనిచేయాలని అధిష్టానం కోరుతోంది.

మొత్తానికి, ఒంగోలులో రగిలిన పొలిటికల్ కాకను చల్లార్చేందుకు తెలుగుదేశం, జనసేన ఉన్నత నాయకత్వాలు తీసుకున్న శీఘ్ర నిర్ణయం కూటమి వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలనలో క్రమశిక్షణ, భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య ఎంత ముఖ్యమో ఈ హెచ్చరిక ద్వారా స్పష్టమైంది. భవిష్యత్తులో జిల్లా స్థాయిలోనే సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలను, ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని నాయకత్వం భావిస్తోంది. నామినేటెడ్ పదవులు, స్థానిక అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. మరి హైకమాండ్ విధించిన గీతను దాటకుండా ఈ ఇద్దరు కీలక నేతలు కలసి పనిచేస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Balineni Srinivasa Reddy,  Damacharla Janardhan, Ongole Alliance Dispute, TDP Jana Sena Warning, Andhra Pradesh Politics, TeluguOne

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.