2014లో రామమందిరం నిర్మించి తీరుతాం

Publish Date:Feb 11, 2012

Advertisement

హైదరాబాద్: అయోధ్యలో రామమందిరాన్ని 2014లో నిర్మించి తీరుతామని, ఈ అంశంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనక్కితగ్గే ప్రసక్తి లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ సంరక్షకులు అశోక్ సింఘాల్ స్పష్టం చేశారు. మత హింస నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆయన శనివారం హైదరాబాద్‌లో విహెచ్‌పి నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబయిలో ముష్కరులు బాంబుదాడులకు పాల్పడిన సందర్భంలో కన్నీటి బొట్టు రాల్చని సోనియాగాంధీ బాట్లా ఎన్‌కౌంటర్ మృతుల పట్ల సానుభూతి ప్రకటించడం జాతికి చేస్తున్న ద్రోహంగా అభివర్ణించారు. ఈ విధంగా ఒక వర్గానికి కొమ్ముకాస్తూ దేశంలో పెరుగుతున్న మత విద్వేషాలకు సోనియా కారణభూతురాలిగా మారుతున్నారని అన్నారు. జాతీయ భద్రతా సలహా మండలి ప్రతిపాదించిన మతహింస నిరోధక బిల్లు కేవలం హిందువులను బలిపశువులను చేయడానికేనని, అందుకే తాము మొదటి నుంచీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశంలోని సాధువులనంతా ఒక్కతాటిపైకి తెచ్చి ఈ బిల్లు ఆమోదం పొందకుండా ఉండేలా ఏప్రిల్‌లో పెద్దఎత్తున ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. దేశంలో ఇటీవలి కాలంలో మతమార్పిడులు పెరగడం ఆందోళన కలిగిస్తున్న పరిణామమని, దీని వెనుక ప్రభుత్వ సాయం ఉందేమోనంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం చట్టవిరుద్ధమని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. యువతంతా వేలంవెర్రిలా వ్యాలెంటైన్ డే జరుపుకోవడం మన సంస్కృతీ, సంప్రదాయాలకు తీరని ద్రోహం చేయడమేనని అన్నారు.

By
en-us Political News

  
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్‌ తెలిపారు.
 ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్ వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి.
దసరా రోజున పాలపిట్టలను సహజ సిద్ధమైన వాతావరణంలో, చెట్లపై స్వేచ్ఛగా ఉన్నప్పుడు మాత్రమే తిలకించాలని అటవీ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎక్కడైనా పక్షుల బంధనం లేదా విక్రయం జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే అటవీ శాఖ   అధికారులకు సమాచారం అందించాలని కోరింది.  
ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం బోసిపోయింది. అయితే నగరం నుంచి ఊళ్లకు వెళ్లే రహదారులు, జాతీయ రహదారులు ట్రాఫిక్ జామ్ లతో దాదాపుగా బ్లాక్ అయ్యాయి. ఊళ్లకు వెడుతున్న జనాలతో నిండిన వాహనాలు పెద్ద సంఖ్యలో రహదారులపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
జ్ఞాన ప్రదాయిని అయిన అమ్మవారిని మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల విద్యాభివృద్ధి కలుగుతుందని, పిల్లలకు  బుద్ధికుశలత లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే  తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది   తమ చిన్నారులతో కలిసి బాసర క్షేత్రానికి పోటెత్తారు.
నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో   ప్రతికూల ప్రభావం చూపిందని, దీని ఫలితంగా రాష్ట్రంలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయని వెల్లడించిన సీఎస్..  సింగూరు డ్యామ్ దాని పరిసర ప్రాంతాలలో నీటి లభ్యతను, పంటల పరిస్థితిని   క్షేత్రస్థాయిలో పరిశీలించాననీ,  భూగర్భ జలమట్టాలు అత్యంత ఆందోళనకరంగా పడిపోయాయని తెలిపారు.
ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్ ఆరోపణల వెనుక నిజమెంత.?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.