డీఎస్సీ ఉపాధ్యాయులపై దాడి.. వైసీపీ నేతలపై కేసులు నమోదు.!

Publish Date:Sep 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం మరోసారి రాజకీయ రచ్చకు తెరలేపింది. విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  కార్యాలయం వద్ద సోమవారం (సెప్టెంబర్ 20) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ సమస్యలను క్రీడల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడికి చేరుకోగా, వైసీపీ శ్రేణులు కూడా నిరసన కార్యక్రమానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఉపాధ్యాయులపై కోడిగుడ్లు, రాళ్లు, వాటర్ బాటిళ్లు విసిరినట్లు, భౌతిక దాడికి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.   

రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై వైసీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాల్లో అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు, ఆ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తాము అర్హతలు, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తమపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు, సంబంధిత మంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు సోమవారం (సెప్టెంబర్ 21)విజయవాడలోని శాప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

విజయవాడలో నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే స్పష్టం చేసినప్పటికీ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. అయితే.. నిరసనకారులు స్టేడియం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. చివరకు నిరసనకారులు శాప్ కార్యాలయం సమీపానికి చేరుకోవడంతో అక్కడ అప్పటికే ఉన్న ఉపాధ్యాయులు, వైసీపీ కార్యకర్తల మధ్య నినాదాల పోటీ మొదలైంది.  ఆ క్రమంలోనే నిరసనకారులు ఉపాధ్యాయులపై దాడికి దిగారు.  దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన శాప్ డైరెక్టర్ల అనుచరులపై కూడా కర్రలతో  దాడి చేశారు.   ఈ ఘటనలో రామకృష్ణ, నితిన్‌రెడ్డి గాయపడినట్లు సమాచారం.  

ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, పేర్ని కిట్టు, జక్కంపూడి రాజా, లేళ్ల అప్పిరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, గౌతంరెడ్డి తదితరులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.   ఉపాధ్యాయులపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో రెండు, సూర్యారావుపేట, కృష్ణలంక పోలీస్‌స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదైంది. 

విజయవాడలో ఉపాధ్యాయులపై దాడిని పలువురు మంత్రులు, కూటమి నేతలు ఖండించారు.  మంత్రి అచ్చెన్నాయుడు   నియామకాలపై అభ్యంతరాలుంటే ఆధారాలతో ముందుకు రావాలని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించాలి తప్ప ఉపాధ్యాయులపై దాడి సరికాదన్నారు.  ఉపాధ్యాయుల భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం ఇసుమంతైనా రాజీపడబోదన్నారు.

మంత్రి నారా లోకేశ్   ఈ ఘటనపై స్పందిస్తూ, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. దాడికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.   

[Attack on Teachers, Vijayawada, YCP DSC Controversy, Sports Quota Teachers, SAAP Office, Mega DSC, Cases YCP Leaders, Nara Lokesh, Andhra Pradesh politics]

By
en-us Political News

  
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.