పప్పూయాదవ్ దాడి.!

Publish Date:Aug 2, 2026

Advertisement

దేశ రాజధాని  హస్తినలో ఎంపీ పప్పుయాదవ్ పై దాడి యత్నం జరిగింది. బిహార్‌లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి  ఇండిపెండెంట్ గా విజయం సాధించిన  రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై  హస్తినలో  ఆయన అధికారిక నివాసంలోనే  దాడి జరగడం కలకలం రేపింది. వ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం (ఆగస్టు 2)  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పప్పూయాదవ్ పై  ఓ వ్యక్తి  చెప్పు విసిరాడు.

 అదే సమయంలో మరో వ్యక్తి..  కత్తితో  దాడికి ప్రయత్నించాడు.   పప్పు యాదవ్ సిబ్బంది, మద్దతుదారులు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడితో  ప్రెస్‌మీట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ మద్దతుదారులు  చెప్పు విసిరిన వ్యక్తిపై   భౌతిక దాడికి  ప్రయత్నించారు.

అయితే.. ఎంపీ పప్పు యాదవ్  ఆ దాడి జరగకుండా నివారించారు.   అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాధు సంత్ ల పట్ల పప్పు యాదవ్ అనుచితంగా మాట్లాడారనే ఆగ్రహంతోనే తాను ఈ చర్యకు పాల్పడినట్లు నిందితుడు  తెలిపినట్లు సమాచారం. కాగా ఈ దాడి ఘటనపై పప్పుయాదవ్ మాట్లాడుతూ..  అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో తీవ్రమైన అవకతవకలు, అక్రమాలు జరిగాయని తాను  బహిరంగంగా ఆరోపించినప్పటి నుంచీ, తనకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయన్నారు.

కొందరైతే  తన  51 లక్షల రివార్డు ప్రకటించారని తెలిపారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.   ప్రజాస్వామ్యంలో నిజాలను నిర్భయంగా మాట్లాడే ప్రజాప్రతినిధులపై ఇలాంటి దాడు దాడులు దారుణమని పప్పుయాదవ్ అన్నారు.  
 Pappu Yadav shoe thrown, Purnia MP attack Delhi, Ram Mandir donation controversy, Pappu Yadav knife attack attempt, Telugu One

By
en-us Political News

  
ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల కష్టాలను ఆలకించడానికి, కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి క్షేత్రస్థాయిలోకి రావడం సహజం
లిఫ్ట్‌లోకి అడుగు పెట్టగానే గాలిల్లో కలిసిపోయిన ప్రాణాలు..!
హైదరాబాద్ నగరం మరోసారి ఘోర హత్యోదంతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మంత్రి లోకేష్‌తో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు భేటీ..!
పిల్లల ప్రాణాలను తీస్తున్న ఇసుక ఈగలు..అసలేంటీ మహమ్మారి..?
నేలతల్లి గర్భంలో కోటానుకోట్ల రూపాయల విలువైన బాక్సైట్ సంపద నిద్రాణమై ఉంది.
కాల్పులు జరిపి ఆత్మహత్య చేసుకున్న ఏపీ అధికారి..ఇద్దరు మృతి..!
రెండు కాళ్లు విరిగిన రోగిపై లైంగిక వేధింపులు.. !
ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అజెండాల కోసం వినియోగించడం తగదని హెచ్చరించింది. పిటిషనర్ పేర్కొంటున్న బాధితులు, అభ్యర్థులు నేరుగా కోర్టు ముందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది.
మైనర్ బాలికను బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్ల సందర్భంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు, సంజ్ఞలతో వేధించినట్లు వచ్చిన ఫిర్యాదుపై మాదాపూర్ పోలీసులు బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది
చూడటానికి ఆకర్షణీయంగా.. చేతిలోకి తీసుకుంటే బరువుగా.. నాణ్యమైన బ్రాండెడ్ మసాలాల్లా కనిపిస్తున్నాయి..
ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నిరసన ప్రాంగణంలో లభ్యమైన ఖాళీ ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల ఆధారంగా పోలీసులు స్థానిక రెస్టారెంట్లు, కేఫ్ యజమానులను విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.