సం‘క్షేమమే’ లక్ష్యం

Publish Date:Feb 17, 2012

Advertisement

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం శాసనసభకు సమర్పించిన 2012-13 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. గత బడ్జెట్‌లో కన్నా కొత్త బడ్జెట్‌లో సంక్షేమ రంగాలకు నిధుల కేటాయింపును పెంచారు. మొత్తంమీద 225 కోట్ల రూపాయల మిగులుతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. వార్షిక బడ్జెట్ రూపొందించడంలో ప్రణాళికా కేటాయింపులకంటే ప్రణాళికేతర కేటాయింపులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించలేక పోయారని స్పష్టమవుతోంది. గత ఐదేళ్ల నుంచి వార్షిక ప్రణాళికలను పరిశీలిస్తే ప్రణాకేతర వ్యయం విపరీతంగా పెరిగిపోతోందని స్పష్టమవుతోంది.

రాష్ట్ర ఖజానాకు 2012-13 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం 1,46,265.56 కోట్ల రూపాయలుగా ఉంటుందని, ఖర్చు 1,45,854.66 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అంటే 410 కోట్ల రూపాయలు మిగులు తేలుతుంది. 2011-12 ఆర్థిక సంవత్సరం 185 కోట్ల లోటుతో ముగుస్తుందని అంచనా వేయడంతో, ఈ లోటును పరిగణనలోకి తీసుకుంటే 2012-13 సంవత్సరం 225కోట్ల మిగులుతో ముగుస్తుందని ఆనం వెల్లడించారు.2011-12లో రూపాయికే కిలో బియ్యంతో సహా సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రైతులకు లక్ష రూపాయల వరకు, స్వయం సహాయ గ్రూపులకు వడ్డీలేకుండా రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. రైతులకు, మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, వడ్డీలేని రుణాల పథకం కోసం ప్రభుత్వ ఏటా 1075 కోట్ల రూపాయలు భరిస్తుందన్నారు. మహిళకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు 100 కోట్ల రూపాయలతో ‘స్ర్తినిధి’ (స్ర్తినిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్)ను ఏర్పాటు చేశామన్నారు.

గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ఇందుకోసం 2012-13 సంవత్సరానికి 4,703 కోట్లు కేటాయించామని ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. సాగునీటికి 2004-05 నుంచి 2011-12 వరకు 71,292 కోట్లు కేటాయించగా, 2012-13 సంవత్సరానికి 24,135 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. చేనేత రంగం అభివృద్ధి తదితర అవసరాలకు 2012-13 సంవత్సరానికి 633 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు తదితర వౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు చెప్పారు. ఐటి రంగాన్ని మండలస్థాయి వరకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ రంగానికి 151కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఇంధన రంగానికి 2012-13లో 5937 కోట్లు కేటాయించారు. ఆర్టీసి 6000 కొత్త బస్సులు కొనుగోలు చేయడంతోపాటు రోడ్ల నిర్మాణం తదితర అవసరాలకు రవాణా, రోడ్లు భవనాల శాఖకు 5032 కోట్ల రూపాయలు కేటాయించారు. పట్టణాల్లో మురికివాడల అభివృద్ధి, నీటిసరఫరా తదితర అవసరాలకుగాను పట్టణాభివృద్ధి కోసం 6586 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్రంలోని మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని 33శాతానికి పెంచేందుకు వీలుగా పర్యావరణ, అటవీ అభివృద్ధి కోసం 524 కోట్ల రూపాయలు కేటాయించారు. పాఠశాల విద్యకు 15,510 కోట్లు, సాంకేతిక విద్యకు 1087 కోట్లు, ఉన్నత విద్యకు 1841 కోట్ల రూపాయలు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి తెలిపారు.

సంక్షేమంలో భాగంగా సాంఘిక సంక్షేమానికి 2,677 కోట్లు, గిరిజన సంక్షేమానికి 1540 కోట్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2,101 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే మహిళా సంక్షేమానికి 2,283 కోట్ల రూపాయలు మైనారిటీల సంక్షేమానికి 489 కోట్ల రూపాయలు కేటాయించామని ఆనం వెల్లడించారు. ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 12.55 లక్షల గృహాలతో పాటు రచ్చబండ-2 సందర్భంగా మంజూరు చేసిన ఆరు లక్షల గృహాలకు కలిపి 2012-13 సంవత్సరానికి 2,302 కోట్ల రూపాయలు కేటాయించామని ఆర్థిక మంత్రి తెలిపారు. కార్మిక, ఉపాధి శాఖకు 500 కోట్లు కేటాయించారు. పర్యాటక, సాంస్కృతి శాఖకు 200 కోట్ల రూపాయలు, క్రీడలకు 220 కోట్ల రూపాయలు కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖకు 2012-13 సంవత్సరానికి 5,889 కోట్ల రూపాయలు కేటాయించారు. స్థానిక సంస్థలకు 175 కోట్లు కేటాయించారు. శాంతి, భద్రతలు, అగ్నిమాపక దళం కోసం 4,832 కోట్లు కేటాయించారు. తహశీల్ కార్యాలయ భవనాల కోసం 20కోట్ల రూపాయలు కేటాయించామని ఆనం వెల్లడించారు.

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ప్రధాన శాఖలకు
ప్రణాళికా కేటాయింపులు (కోట్లలో)


శాఖ 2011-12 2012-13
నీటిపారుదల 15,010 15,013
పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి 4,953 5,855
విద్యాశాఖ 4,461 4,799
పురపాలన, పట్టణాభివృద్ధి 3,676 6,856
రవాణా, రోడ్లు, భవనాలు 2,676 3,210
గృహనిర్మాణం 2,300 2,300
వ్యవసాయం, సహకారం 2,148 2,819
వైద్యం, ఆరోగ్యం 2,117 2,364
స్ర్తి, శిశు సంక్షేమం 1,856 2,282
సాంఘిక సంక్షేమం 1,549 1,719
గిరిజన సంక్షేమం 692 1,013
మైనారిటీ సంక్షేమం 295 482
బిసి సంక్షేమం 1,502 2,656
ప్రణాళికా శాఖ 1,023 1,143
పశుసంవర్ధనం, మత్స్యశాఖ 370 504
రెవెన్యూ శాఖ 226 399
యువజన, టూరిజం 168 343
న్యాయశాఖ 14 102
ఐటి అండ్ సి 48 148

By
en-us Political News

  
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.