అత్యంత ధనవంతురాలైన సీఎం- మాయావతి !
Publish Date:Jan 11, 2012
Advertisement
ఉత్తర్ ప్రదేశ్ : అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ సీఎం మాయావతే అత్యంత ధనవంత సీఎంగా నిలిచారు. ఈమె మొత్తం ఆస్తుల విలువ రూ.87.27 కోట్లుగా లెక్క తేలింది. ఈ ఆస్తుల్లో ఎక్కువ శాతం తన అభిమానులు ఇచ్చిన కానుకల వల్ల సమకూరినవేనని ఆమె ప్రకటించిన ఆస్తుల వివరాల పట్టికలో పేర్కొంది.అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ 10 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను న్యూఢిల్లీలో వెల్లడించింది. ఈ జాబితాలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రూ.51 కోట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 8.01 కోట్ల రూపాయల ఆస్తితో నాలుగో స్థానంలో నిలిచారు. అయితే, ప్రస్తుతం ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోల్చితే మాయావతి ధనిక సీఎంగా గుర్తింపు పొందారు. అలాగే, అత్యంత పేద ముఖ్యమంత్రిగా మణిపూర్ సీఎం ఓక్రామ్ ఇబొబీ నిలిచారు. ఇబొబీ ఆస్తులు కేవలం రూ.6 లక్షలు మాత్రమేనని ఆ సంస్థ తెలిపింది.
http://www.teluguone.com/news/content/assembly-24-10853.html





