నియంతలా వ్యవహరిస్తున్న ఎపిఎస్పి అధికారులు?
Publish Date:Aug 6, 2012
Advertisement
ఆంథ్రప్రదేశ్ స్పెషల్పోలీస్బెటాలియన్(ఎపిఎస్పి) ఉన్నతాధికారులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. నక్సల్ కూంబింగ్ వంటి స్పెషల్ ఆపరేషన్స్‌లో పాల్గొనే స్పెషల్పోలీసుల పని ఒత్తిడి గురించి ఎపిఎస్పి బెటాలియన్ ఉన్నతాథికారులు పట్టించు కోవటం లేదని ఆరోపణలు వచ్చాయి. వాతావరణం బాగోలేకపోయినా పోలీస్‌శాఖ ఇచ్చే ఆపరేషన్స్‌లో పాల్గొనే సిబ్బంది ఆరోగ్య ఇబ్బందులు అసలు పట్టించుకోవటం లేదని విమర్శలు ఎక్కువయ్యాయి. అత్యవసరమై నప్పుడు వైద్యసేవలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని సిబ్బంది కుటుంబాల వారు వాపోతున్నారు. కుటుంబపరమైన అత్యవసర సమయం అవసరమై నప్పుడు సెలవు కోరితే ఉన్నతాథికారులు నిరాకరిస్తున్నారని స్పెషల్ పోలీసు సిబ్బంది భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో అనారోగ్యంతో ఒకరు మరణించటం వెనుక ఎపిఎస్పి 8వబెటాలియన్ ఉన్నతాథికారుల నిర్లక్ష్యమే కారణమని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోపంలోనే వీరు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ధర్నా కూడా చేశారు. ఈ ధర్నా సమయంలో దృశ్యాలను వీడియో తీస్తున్న ఒకరిని స్పెషల్పోలీసులకు చెందిన మహిళలు చితకబాదారు. ఉన్నతాథికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సివిల్‌పోలీసులు, స్పెషల్పోలీసులు ఘర్షణకు దిగారు. ఒకరిని మరొకరు ముష్టిఘాతాలతోనూ కుమ్ముకుంటూ, పొర్లాడుకుంటూ కొట్టుకున్నారు. చూసిన వారందరూ పోలీసుఫైట్ ఇలా ఉంటుందన్న మాట అనుకునేలా ఈ ఘర్షణ జరుగుతుంటే పోలీసు సిపి రెండు వర్గాలనూ అదుపు చేశారు. అనంతరం కొందరు మహిళలను పోలీసు అథికారుల సంఘనాయకులు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. అప్పుడు మహిళల వినతి విన్న మంత్రి తనకు పూర్తి సమాచారం అందిందని, ఎపిఎస్పి ఉన్నతాథికారులతో తాను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఎపిఎస్పి ఉన్నతాథికారులు నియంతలా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి స్పందించారు. తక్షణం వారి వైఖరిలో మార్పు వచ్చేలా చర్య తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/apsp-officers-not-sanctioning-leaves-to-the-battalion-24-16288.html





