సామాన్యుడి జేబుపై భారం పడే మార్పులు.. ఏప్రిల్ 1 విడుదల!
Publish Date:Mar 31, 2026
Advertisement
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ పరిస్థితుల్లో సామాన్యుడి జేబుపై ప్రభావం చూపించే కొన్ని కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. వాటిలో మొదటిది ఆదాయపన్ను. డిఫాల్ట్ టాక్స్ రిజిమ్ అంటారు దీన్ని. ఒక వేళ మీరు ప్రత్యేకంగా పన్ను ఎంపిక విధానం అనుసరించకుంటే.. మీ పన్ను ఆటోమేటిగ్గా కొత్త పన్ను విధానం కిందకే వస్తుంది. ఇక పన్ను మినహాయింపు పరిమితిలోకి వస్తే.. 2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెసలుబాటు ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ విషయానికి వస్తే.. జీతభత్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాలు ఈ కొత్త విధానంలో కూడా కొనసాగుతాయి. ఇక గ్యాస్ సిలిండర్ ధరల విషయం పరిశీలిస్తే.. ప్రతి నెలా ఒకటవ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్.. గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న చమురు ధరల అస్థిరత కారణంగా.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉండొచ్చు. డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో ప్రభుత్వం రాయితీపై నిర్ణయం తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డుల వ్యవహారానికి వస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల విధానాన్ని మారుస్తున్నాయి. ముఖ్యంగా రెంట్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ఇచ్చే రివార్డు పాయింట్లు తగ్గించడమో లేదా నిలిపివేయడమో జరగవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీలు.. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం ఈ ఏప్రిల్ ఒకటి నుంచి పాలసీలను డిజిటల్ గా ఉండటం తప్పనిసరి అవుతుంది. ఇందువల్ల పాలసీ డాక్యుమెంట్లు పోతాయన్న భయం ఉండదు. సరెండర్ వాల్యూ నిబంధనల్లో మార్పులు రావడం వల్ల పాలసీని మధ్యలోనే ఆపేసేవారికి గతంతో పోలిస్తే కొంత మెరుగైన రీఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది. నిత్యావసర మందుల ధరల సూచీ ఆధారంగా, పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, గుండె సంబంధిత మందుల ధరలు రెండు నుంచి ఐదు శాతం పెరిగే అవకాశముంది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల.. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 అనేది కేవలం క్యాలెండర్ లో తేదీ మార్పు మాత్రమే కాదు, మీ బడ్జెట్ ప్రణాళికను కూడా మార్చుకోవాల్సిన టైం. ముఖ్యంగా పన్ను ఆదా కోసం పాత పద్ధతిలో పెట్టుబడులు పెట్టేవారు, కొత్త విధానంలో ఆ ప్రయోజనాలు ఉండవని గుర్తుంచుకోవాలని సూచి స్తున్నారు ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్.
http://www.teluguone.com/news/content/april-1st-new-financial-year-start-45-216453.html





