ప్రధాన్ రాజీనామా.. ఆప్ విద్యామంత్రికీ ఎసరు?

Publish Date:Jul 28, 2026

Advertisement

నీట్ పేపర్ లీకేజీల నిరసనల్లో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ఇప్పుడు పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ ను ఇరుకున పెట్టింది. నీట్ లీకేజీకి నిరసనగా.. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హస్తిన వేదికగా జరిగిన ఆందోళనకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ,   ప్రధాన్ మస్ట్ గో’ అంటూ ప్రచారం చేసింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆపార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాలు జంతర్ మంతర్ కు వెళ్లి మరీ కాక్రోచ్ ఆందోళనలకు సంఘీ భావం ప్రకటించారు.   ఆ సందర్భంగా  ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా   పంజాబ్‌లో  అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంలో ఇప్పటి వరకూఅంటే గత నాలుగున్నర ఏళ్లుగా  ఒక్క పేపర్ లీక్  అవ్వలేదని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా, ఒక వేళ అలా లీక్ అయి ఉంటే పంజాబ్ విద్ాయమత్రి చేత రాజీనామా చేయించి ఉండేవారమని సవాల్ చేశారు.  

ఆ సవాలే ఇప్పుడు ఆప్ విద్యామంత్రి పదవికి ఎసరు తెచ్చింది.  మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన   కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్  పార్టీలు  పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో  కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు,  లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.  ఇటీవల ఫరీద్‌కోట్‌లో జరిగిన 454 ఫార్మసిస్ట్ పోస్టుల నియామక పరీక్షలో చోటుచేసుకున్న హైటెక్ కాపీయింగ్ వ్యవహారం పంజాబ్‌లో పెద్ద కలకలం రేపిన సంగతి విదితమే. అభ్యర్థులు పెన్ కెమెరాల ద్వారా ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపి, వైర్‌లెస్ పరికరాల ద్వారా సమాధానాలు పొందినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 3.5 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు లంచాలు వసూలు చేసినట్లు పోలీసు దర్యాప్తులో బయటపడింది.

అలాగే ఫిబ్రవరి 2023లో..  పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ 12వ తరగతి ఇంగ్లీష్ బోర్డు పరీక్ష ప్రారంభానికి   ముందు  లీక్ కావడంతో ఆ పరీక్షను అత్యవసరంగా రద్దు చేశారు. ఇవే కాకుండా,  నైబ్ తహసీల్దార్ రిక్రూట్‌మెంట్, పంజాబ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష , అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, పిఎస్‌ఎస్‌ఎస్‌బి గ్రూప్-బి పరీక్షలలో కూడా   కుంభకోణాలు బయటపడ్డాయి.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, నీతికి కట్టుబడి పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బేన్స్, ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ కూడా  తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్, అకాలీదళ్ నాయకురాలు హ డిమాండ్ చేస్తున్నారు.  దీంతో ప్రధాన్ మస్ట్ గో’ ఉద్యమం కాస్తా పంజాబ్‌లో  బేన్స్ రాజీనామా’ డిమాండ్ కు  దారి తీసింది. చూడాలి మరి ఇప్పుడు ఆప్ ఏ విధంగా స్పందిస్తుందో?  

Harjot Singh Bains, Manish Sisodia Challenge, Punjab Paper Leak Scam, Dharmendra Pradhan Resignation, Punjab Elections

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.