రెండేళ్లల్లోనే రెట్టింపు.. ఏపీ సాఫ్ట్ వేర్ ఎగుమతులు.!

Publish Date:Aug 13, 2026

Advertisement

వైఎస్ జగన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్  అభివృద్ధి అనవాలు కూడా లేని పరిస్థితి ఉండేది.  జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా  పరిస్థితి ఉండేది.  దాంతో  జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు   చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.   జగన్ సర్కార్ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు, పరిశ్రమల సంగతి అటుంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయిన పరిస్థితి.  ఇక కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమమన్నట్లుగా అప్పట్లో పరిస్థితులు ఉండేవి.  

రాష్ట్ర విభజన తరువాత    చంద్రబాబు నాయుడు హయాంలో  ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి.  అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురానికి వచ్చింది.  చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో  సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో  ఆ గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడమే కాకుండా  జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని కుండబద్దలు కొట్టేసింది.

చిత్తూరు జిల్లాకు చెందిన అమర రాజా కంపెనీ జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించేసింది. ఇలా చెప్పాలంటే జాబితా చాలా చాలా పెద్దగానే ఉంటుంది. మొత్తం మీద ఒక్క ముక్కలో చెప్పాలంటే  జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు రావు  ..ఉన్న పెట్టుబడులు నిలవవు అన్నట్లుగా ఆయన హయాంలో పరిస్థితి మారిపోయింది. అటువంటి పరిస్థితి 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత పూర్తిగా మారిపోయింది. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలూ క్యూడుతున్న పరిస్థితి ఏర్పడింది. 

ఇక ఐటీ రంగం విషయానికి వస్తే.. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరి  ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి..  అయితే  2019లో రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత అవన్నీ ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది.  జగన్‌ నిర్వాకం వలన అప్పట్లో ఐ‌టి ఎగుమతులలో దేశంలో అట్టడుగు స్థాయికి  ఆంధ్రప్రదేశ్ పడిపోయింది.  2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్‌ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువల ఐ‌టి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్‌ వంతు కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే! 

అలాంటిది 2024లో రాష్ట్రంలో చంద్రబాబునాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో సరికొత్త శకం ఆరంభమైంది! జగన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం మందగమనంతో సాగిన సాఫ్ట్‌వేర్ ఎగుమతులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండంటే రెండేళ్లలో  రెండు రెట్లకు పైగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా రూపుదిద్దుకున్న పారిశ్రామిక విధానాలు, ఐటీ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు,  విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలలో పెరిగిన మౌలిక సదుపాయాలు ఈ విప్లవాత్మక  వృద్ధికి  కారణాలు. గతంలో నామమాత్రపు స్థాయిలోనే పరిమితమైన ఎగుమతులు, ఇప్పుడు వేల కోట్ల రూపాయల రాబడిని తెచ్చిపెడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తున్నాయి. 

  రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న  ప్రోత్సాహకాలు, పెట్టుబడుల ఆకర్షణ విధానం,   ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోత్సహించే ఎకోసిస్టమ్ కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్‌ను తమ  డెస్టినేషన్‌గా భావిస్తున్నారు. ఐటీ దిగ్గజాలు తమ ద్వితీయ, తృతీయ స్థాయి కార్యాలయాలను ఏపీ ప్రధాన నగరాల్లో నెలకొల్పడానికి ఉత్సాహం చూపుతున్నారు.ఇదే రీతిలో సాఫ్ట్‌వేర్ ఎగుమతులు వృద్ధి కొనసాగితే.. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్  దేశంలోనే అగ్రగామి ఐటీ హబ్‌ల జాబితాలో నిలవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

AP Software exports growth, Andhra Pradesh IT exports, Vizag IT hub, , Andhra Pradesh tech sector, TeluguOne

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.