రాజధాని పేరు వెనుక సీక్రెట్ బయటపెట్టిన చంద్రబాబు.!

Publish Date:Aug 13, 2026

Advertisement

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి  పేరు వెనుక ఉన్న వ్యక్తి ఎవరన్న   సీక్రెట్ బయటపెట్టారు.  అమరాతి  ప్రగతికి, పురోగతికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానికి అమరావతి అని పేరు పెట్టాలనే ప్రతిపాదన వెనుక  ఉన్న వ్యక్తి ఈనాడు  అధినేత   రామోజీరావు అని వెల్లడించారు.  రాజధాని నిర్మాణం చేపడుతున్న ప్రారంభ సమయంలో రామోజీరావు  తనకు స్వయంగా ఫోన్ చేశారని గుర్తు చేసుకున్న చంద్రబాబు.. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న ఆ ప్రాంతానికి ఉన్న ప్రాచీన విశిష్టత, చారిత్రక నేపథ్యంపై తన మీడియా బృందంతో ప్రత్యేకంగా రీసెర్చ్ చేయించి ఒక సమగ్ర నివేదికను రూపొందించినట్లు చెప్పారనీ, ఆ సదర్భంగానే ఆయన రాజధానికి అమరావతిపేరు సూచించారనీ చంద్రబాబు వెల్లడించారు. ఆ తరువాత రామోజీరావు తనకు ఆ పరిశోధనా పత్రాన్నిపంపారనీ, దాని  ఆధారంగానే  ఆంధ్రప్రదేశ్ రాజధానికి 'అమరావతి' అనే పేరు పెట్టాననీ అన్నారు. రామోజీ నోట వెంట అమరావతి పేరు వినగానే  తనకు  పవిత్ర భావన కలిగిందనీ, ఒక్కసారిగా ఒళ్లు పులకరించిందనీ చంద్రబాబు చెప్పారు. 

శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా  అమరావతి' పేరు  ప్రకటించినప్పుడు రాష్ట్రంలో ఏ   రాజకీయ నాయకుడి నుంచి  ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రాలేదన్న ఆయన అమరావతికి  ఎవరూ ప్రత్యామ్నాయ పేరును కూడా సూచించలేకపోయారన్నారు.  అమరావతి అనే పదంలో ఉన్న మహత్తర శక్తే అందుకు కారణమన్నారు. 

జగన్ హయాంలో మూడు రాజధానుల నిర్ణయం వల్ల అమరావతి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. అమరావతి రైతుల సుదీర్ఘ పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. ఆ సమయంలో రైతులకు అండగా నిలిచేందుకు పార్టీ ఖాతాలో నిధులు లేకపోయినా, స్వయంగా జోలె పట్టి నిధులు సేకరించి సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయపోరాటానికి సహకరించిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాజధాని ఉద్యమ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముళ్ల కంపలను సైతం లెక్కచేయకుండా రైతులకు మద్దతుగా నిలిచారని ప్రశంసించారు. అలాగే తన సతీమణి నారా భువనేశ్వరి కూడా రైతుల ఉద్యమానికి   తన చేతి గాజులను విరాళంగా ఇచ్చి మద్దతు పలికారని  గుర్తు చేసుకున్నారు.

అమరావతి   నిర్మణంలో   ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, భవిష్యత్తులో ఎక్కడా విద్యుత్ స్తంభాలు లేదా పదేపదే రోడ్లు తవ్వే పరిస్థితి లేని విధంగా భూగర్భ డక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్‌లో సైబరాబాద్,  ఓఆర్ఆర్ నిర్మించిన అనుభవంతో అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలందరూ ఆరోగ్యం, సంపద,  ఆనందంతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్న చంద్రబాబు అమరావతి ప్రజా రాజధానిగా.. రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని భరోసా ఇచ్చారు. 

Amaravati Capital Name Story,  Chandrababu Naidu, Ramoji Rao,  Amaravati Research Paper, AP Capital Amaravati History, TeluguOne

By
en-us Political News

  
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.