జగన్ న్నాథ రథచక్రాల కిందనలిగిపోతున్న ఏపీ

Publish Date:May 8, 2023

Advertisement

వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రధ చక్రాలు వస్తున్నాయి.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం రావాలంటే... ప్రతిపక్ష నేత  జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాల్సిందే.. అలా అయితేనే.. ప్రజలకు శాంతి, సౌఖ్యం, సంక్షేమం అంటూ వేల కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో వైసీపీ అధ్యక్షుడు  జగన్ నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు అందరూ చెప్పుకొంటూ పోవడంతో..  ఓటర్లు అమాయకంగా జగన్ పార్టీకి గంపగుత్తగా ఓట్లు గుద్దిపారేశారు. ఆ గుద్దుడికి అప్పటి ప్రతిపక్ష పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కూర్చిలోకి వచ్చి పడ్డారు. అలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. 2019, మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే 2023, మే 30వ తేదీకి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి  అవుతుంది. 

 ఈ నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా జగనన్న.. పాలనా వైభోగాన్ని ఒక సారి అవలోకనం చేసుకుంటే..  గతంలో చెప్పినట్లు రాజన్న రాజ్యం తీసుకువచ్చారా?  రాష్ట్రాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానానికి తీసుకెళ్లారా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు..  మోదీ ప్రభుత్వంతో పోరాడి మరీ సాధించుకొచ్చారా? ఆంధ్రప్రదేశ్  జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా?  అభివృద్దిలో  ఆంధ్రప్రదేశ్.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడి దూసుకుపోతోందా?  రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయా?  ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు.. వస్తున్నాయని   వైసీపీ నేతలు చెప్పినట్లు ఆ జగన్నాథ రథచక్రాలు వచ్చాయా వచ్చేశాయా అంటే పరిశీలకులు వచ్చేశాయంటున్నారు. కానీ అవి జనాన్ని తొక్కుకుంటూ సాగుతున్నాయనీ.. ఆ ‘జగన్’ న్నాథ రథచక్రాల కింద పడి జనం నలిగిపోతున్నారనీ విశ్లేషిస్తున్నారు. 
 గన్ గద్దెనెక్కిన నాటి నుంచి నేటి వరకు ఈ నాలుగేళ్ల పాలనలో.. ప్రజా వేదిక కుప్పకూల్చడంతో ప్రారంభమైన  విధ్వంసం.. అప్రతిహాతంగా అలా కొనసాగుతూనే ఉేందని అంటున్నారు.  ఆ తర్వాత ఇసుక సరఫరా  నిలిపివేతతో భవన నిర్మాణదారులు పెట్టిన ఆర్తనాదాలు,   జగనన్న తీసుకొచ్చిన కొత్త మద్యం బ్రాండ్లతో.. మందుబాబులకు కిక్క్ ఎక్కడం దేవుడేరుగు.. కిక్క్ డ్ ది బెక్కెట్ అన్నట్లుగా.. ప్రాణాలు హరించిపోతున్నాయి.

ప్రతిపక్షనేతగా రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించి..  . అధికారంలోకి మూడు రాజధానులు ఉండాలని.. అలా అయితేనే పాలన, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతోందని ప్రకటించడం.. ఆ దిశగా అడుగులు తడబడుతూ వేయడం.. దాంతో తాము నిండిమునిగిపోయామంటూ... ఆందోళనలకు దిగినా.. ధర్నాలు చేసినా... ఆక్రందనలతో పెడబొబ్బలు పెట్టినా రాజధానికి భూములిచ్చిన రైతుల గోడు పట్టించుకునే నాథుడు లేకపోవడంతో.. తమ బాధలు, తమ గాధలు అటు ఆ కలియుగదైవం శ్రీవెంకటేశ్వరుడికి.. ఇటు ప్రత్యక్ష నారాయణుడు అరసవిల్లిలోని శ్రీసూర్య భగవానుడి చెప్పుకొనేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ఫలితం మాత్రం లేకపాయే. 

ఇక జగన్ అధికారంలోకి రాగానే అమలు చేస్తున్న నవరత్న పథకాలు.. కాలం గడిచే కొద్ది... రంగు వెలిసిపోతూ.. నవరత్నాల ఉంగరంలోని నకిలీ రాళ్లు.. రాలినట్లుగా ఒక్కొ పథకం ఒక్కో రాయి లాగా జారి పడిపోతున్నాయి. ఇక తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసి.. ఆ స్థానంలో పాత ఫించన్ విధానాన్ని అమలు చేస్తామంటూ ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చి .. అధికారంలోకి రాగానే.. ఆ హామీని తుంగలోకి తొక్కి.. తాము మాట తప్పం.. మడమ తిప్పం అంటూ చెప్పుకున్న గొప్పలన్నీ డొల్లేనని రుజువు చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్ర విభజనతో ప్రభుత్వానికి రాబడి నిల్.. అప్పులు మాత్రం ఫుల్‌గా ఉండడంతో.. రాష్ట్రంలో ఆర్థిక శాఖ కాస్తా.. అప్పుల శాఖగా మారిపోయింది.  ఇలా చెప్పుకొంటూ పోతే.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలోని చోటు చేసుకొన్న వైఫల్యాలు లెక్కకు అందనన్ని ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

ఇక ఎగత న్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత   జగన్ సొంత బాబాయి,  వివేకా దారుణ హత్యకు గురైతే... సొంత ఇంటి మనిషి ప్రభుత్వాధినేతగా ఉండి కూడా న్యాయం జరగకపోవడం... పట్ల ప్రజలే ముక్కున వేలేసుకుంటున్నారు.  ఇలా ఈ నాలుగేళ్లల్లో జగనన్న పాలనను బేరిజు వేసుకొంటూ వెళ్లితే.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసుకుంటే.. భూమీ ఆకాశాలు కలిసే చోటే అది ఆవిష్క్రృతమవుతోందని  రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అందుకే వచ్చేశాయి.. వచ్చేశాయి... తొక్కేశాయి.. తొక్కేశాయి.. జగన్నాథ రధచక్రాలు.. రథ చక్రాల కిందపడి.. టోకుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఆనవాలు లేకుండా.. ఆంధకారంలో పడి కొట్టుమిట్టాడుతోంది.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.