కాలం కలిసి రావడం లేదా?

Publish Date:May 7, 2023

Advertisement

కాలం... ఓ మాయల మరాఠి.  అది చేసే జిమ్మిక్కుల ముందు.. ప్రతి ఒక్కరు తైతక్కలాడాల్సిందే. కాలం కొట్టే దెబ్బకు ఎవరూ అతీతులు కారు. చిట్ట చివరకు సృష్టి, స్థితి, లయ కారకులైనా సరే. ఇంకా చెప్పాలంటే... పాలమ్మినోడిని ఓ రాష్ట్రంలో మంత్రిని చేస్తే.. టీ అమ్మినోడిని ఓ దేశానికి ప్రధాన మంత్రిని చేస్తోంది. పార్టీ అధినేతలుగా, ముఖ్యమంత్రిగా పీఠాలెక్కి రాజ్యాలు ఏలిన వాళ్లు నానా గడ్డి తిన్నారంటూ.. చివరకు శ్రీకృష్ణజన్మస్థానంలోకి తోసి.... ఊచలు లెక్కించేలా చేస్తుందీ. అదీ కాలం. అదీ కాల మహిమంటే. పాలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి వస్తుంది కాలం కలసిరాకపోతే.

అలా కాలం ఈడ్చీ కొట్టిన దెబ్బకి ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మే 5వ తేదీ ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టి..  మీడియా ముందు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాదు.. తనపై సొంత పార్టీ వారే.. ఇంకాచెప్పాలంటే..  తాను ఎమ్మెల్యే సీట్లు ఇప్పించిన వారే..  తనపై విమర్శలు చేస్తున్నారంటూ ఒకానొక దశలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.  అయితే అయిదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఓ సారి మహానేత, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా... మరోసారి వైయస్ జగన్ తొలి కేబినెట్‌లో అడవులు, పర్యావరణం, ఇంధన శాఖ మంత్రిగా పని చేశారని.. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయాలను శాసించి.. ఓ ఊపు ఊపిన తమ ఎమ్మెల్యే బాలినేని.. ఇలా.. ఇలాగా మాట్లాడతారని తాము కలలో కూడా అసలు ఊహించలేదని ఒంగోలు నగర వాసులు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు. 

గతంలో బాలినేని వాసన్న హవాను ఈ సందర్బంగా జిల్లా వాసులు గుర్తు చేసుకొంటున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అత్యంత సమీప బంధువన్న సంగతి అందరికి తెలిసిందేనని. ఆ క్రమంలో ఆయనకు పార్టీలోనే కాదు.. బంధు వర్గంలో కూడా ఆయనకు మంచి ఆదరాభిమానాలు ఉన్నాయని.. ఓ నాడు అలా ఓ వెలుగు వెలిగిన నాయకుడు నేడు ఇలా మాట్లాడడం చూస్తేంటే తమకే బాధేస్తోందని ఒంగోలు నగర వాసులు ఓ విధమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా బాలినేని పవర్‌లో ఉండగా చేసిన పనులే ఆయనను ఈ స్థితికి తీసుకు వచ్చాయనే అభిప్రాయం సైతం వారి నుంచి వ్యక్తమవుతోంది. అంతేకాదు.. నాటి సంఘటనలను వారు సోదాహరణగా వివరిస్తోంది. 

బాలినేని శ్రీనివాసరెడి జన్మదినం డిసెంబర్ 12వ తేదీ. అయితే 2021 ఏడాదిలో బాలినేని వాసన్న జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఒంగోలులో ఊరు వాడల ఘనంగా నిర్వహించాయి. ఆ సందర్భంగా బాలినేని వీరాభిమాని, పార్టీ కార్యకర్త సుబ్బారావు గుప్తా.. ఫ్యాన్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత.. వరుసగా చోటు చేసుకోంటున్న పరిస్థితులు... అలాగే భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వస్తే.. మన పార్టీ శ్రేణులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందంటూ.. ప్రస్తుత పరిస్థితులను అకళింపు చేసుకొని మరీ సుబ్బారావు గుప్తా మాట్లాడారని... అయితే అతడేదో పెద్ద నేరం చేసినట్లు.. ఆయనకు బాలినేని వాసన్న వర్గం నుంచి బెదింపులు రావడంతో ప్రాణ భయంతో బిక్కు బిక్కు మంటూ భయపడి గుంటూరు పారిపోయి.. ఓ లాడ్జిలో తల దాచుకొన్నారు. ఆ క్రమంలో గుప్తా కుటుంబం ఎంత వేదన పడిందో అందరికీ తెలిసిందే. 

కానీ బాలినేని ప్రధాన అనుచరుడు సుభానీ.. సుబ్బారావు గుప్తా ఆచూకీ కనుగొని.. అతడిపై దాడి చేస్తూ.. బండబూతులు తిడుతూ... మంత్రి బాలినేనికి క్షమాపణలు చెప్పించారు. అందుకు సంబంధించిన వీడియో నాడే కాదు.. నేడు సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే సుబ్బారావు గుప్తాపై దాడి అంశంలో మంత్రి బాలినేని అనుచరులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆ క్రమంలో పలు సంఘాలు సైతం ఆందోళన బాట పట్టడంతో.. బాలినేనిపై తీవ్ర ఒత్తిళ్లు రావడంతో..  తన అనుచరుడు సుభానీపై పోలీసులు కేసులు నమోదు చేయక తప్పలేదు. ఆ తర్వాత అతడిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ వ్యవహారం ఒంగోలు నియోజకవర్గంలో తీవ్ర వివాదాస్పదమైందని నగర ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 

దేవుడుకి, కాలానీకి అందరూ సమానులే. అందుకే సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏదీ ఇవ్వాలో అది ఇచ్చేసే వెళ్తోంది... అలాగే ఎవరి నుంచి ఏమీ తీసుకోవాలో అదీ ఖచ్చితంగా తీసుకోనే వెళ్లుందో.. అదీ బలవంతంగా అయినా సరే. అయినా కాలానికి లేనోళ్లు, గొప్పొళ్లు అనే బేధభావం ఉండదు. ఎందుకంటే అది కాలం కదా అని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.