వైసీపీలో అసమ్మతికి జగనే కారణమా?

Publish Date:May 8, 2023

Advertisement

యిటీవల విడుదలైన సినిమాలలో బలగం ప్రజలను విశేషంగా ఆకర్షించింది. ఆ సినిమా గొప్పతాన్ని యిక్కడ మనమేమీ చర్చించుకోవడం లేదు. కానీ ఒక కుటుంబాన్ని ముందుండి నడిపించాల్సిన వ్యక్తి ఆ పని చేయకపోతే.. ఏం జరుగుతుందో ఈ సినీమా అర్ధమయ్యేలా చెప్పింది. కుటుంబం చీలిపోతుంది. ఒకరికి ఒకరు వ్యతిరేకులౌతారు. శత్రువులౌతారు. ఒక రాజకీయ పార్టీ విషయమేనా అంతే.. పార్టీ నేత పార్టీని ఒక కుటుంబంగా.. అందులో సభ్యులందరినీ తనవారుగా భావించకపోతే పార్టీ చీలిపోతుంది. చీలికలు పేలికలు అవుతుంది.

యిందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా మాత్రం జగన్ అధినేతగా ఉన్న వైసీపీని చెప్పుకుంటే సరిపోతుంది. జగన్  తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపారు. ఆయన జీవించి ఉన్నంత వరకూ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి ఉన్నప్పటికీ.. అదంతా ఏదో ఒకరిద్దరికి సంబంధించిన వ్యవహారంగానే ఉండింది. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత కూడా పార్టీలో మెజారిటీ భాగం ఆయన కుమారుడి జగన్ కు మద్దతుగా నిలిచారు. వైఎస్ వారసుడిగా జగన్ నే ముఖ్యమంత్రిని చేయాలంటూ.. ఆయన మృతదేహం సాక్షిగా సంతకాల సేకరణ కూడా జరిగింది. అయితే జగన్ వ్యవహార శైలి కారణంగా అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా అందుకు అంగీకరించలేదు. దీంతో జగన్ సొంత కుంపటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పెట్టుకున్నారు. అప్పుడు కూడా వైఎస్ అభిమానులు జగన్ వెంటే నడిచారు.

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మరీ జగన్ పార్టీలో చేరారు. ఒక ఎన్నికలలో ఓడిపోయినా జగన్ ను వారు వీడలేదు. సరే 2019 ఎన్నికలలో జగన్ సొంత పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. వైఎస్ కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అక్కడ నుంచే జగన్  పెద్దరికం డొల్లతనం బయటపడింది.  నేను అని తప్ప మనం అన్న పదానికి అర్ధం తెలియని విధంగా వ్యవహరించడంతో తొలుత ఆయన సొంత కుటుంబీకులే దూరమయ్యారు.  పార్టీ కుటుంబం సరే.. అదే పార్టీలో సొంత తల్లి, తోడబుట్టిన చెల్లి కూడా ఉన్నారు. వారిరువురినీ ఆయన దూరం పెట్టారు. కారణాల జోలికి వెళ్లడం లేదు. వారిరువురినే దూరం పెట్టిన జగన్ పార్టీలో కూడా ఎవరికీ అందుబాటులోకి రాని రాజరికాన్ని ప్రదర్శించారు.  ఫలితంగా యిప్పుడు వైసీపీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఏ క్షణంలో ఎవరు పార్టీని వీడుతారు.. ఎవరు పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారు అన్నది పార్టీ అధినేతకే అర్ధం కాని పరిస్థితి నెలకొంది.

ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో జగన్  అవినాష్ రెడ్డి కి మద్దతుగా నిలిచిన తీరు.. అందుకోసం అందరూ అజాత శత్రువుగా భావించే వివేకానందరెడ్డి వ్యక్తిత్వంపై వేస్తున్న నిందలు, ఆమె కుమార్తె తన తండ్రి హంతకుల ను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలంటూ చేస్తున్న న్యాయపోరాటం.. వైఎస్ పై ఉన్న అభిమానాన్ని కూడా బద్దలు కొట్టి జగన్ కు వ్యతిరేకతను పెంచేలా ఉందని పరిశీలకులు చెబుతున్నారు.  తాను జైలులో ఉన్నంత కాలం పార్టీని పదిలంగా కాపాడిన తల్లి విజయమ్మ, ఆయన తల్లి విజయలక్ష్మి  చేత వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయించడం, జగనన్న వదిలిన బాణాన్ని అంటూ కలికి బలపం కట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన షర్మిలను పార్టీకి దూరం చేయడం వంటివన్నీ జగన్ వ్యక్తిత్వాన్ని పార్టీ శ్రేణుల ముందు బ్లాక్ అండ్ వైట్ లో నిలబెట్టాయి.

దీంతో  ప్రజలలో ఆయన పాలనా తీరు పట్ల వ్యతిరేకత వ్యక్తమౌతుంటే.. పార్టీలో ఆయన నిరంకుశ శైలి పట్ల వ్యతిరేకత ప్రబలుతోంది.  ముందు ముందు ఈ వ్యతిరేకత మరింత పెచ్చరిల్లే ప్రమాదం ఉందంటున్నారు. బలగం సినిమాలో కుటుంబ పెద్ద అల్లుడిని కొడుకులు అవమానిస్తుంటే అడ్డుకోలేక కుటుంబ చీలికకు కారణమైతే.. వైసీపీలో జగన్ తానే స్వయంగా అయిన వారిని అవమానాల పాలు చేస్తూ పార్టీలో ముసలానికి కారణమౌతున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.