షర్మిల పాదాలు ఎక్కడికి... ఏపీకా.. తెలంగాణాకా?

Publish Date:Aug 10, 2023

Advertisement

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్ షర్మిల కారణాలు ఏవైనా, రెండేళ్ళ క్రితం తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ( వైఎస్సార్ టీపీ)  ఏర్పాటు చేశారు. తెలంగాణలో వైఎస్ పాలన అందిస్తామని ప్రజల్లోకి వెళుతున్నారు. 

అయితే, అప్పటి నుంచీ... ఆమె ఏపీ గురించి ఇసుమంతైనా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ వాదాన్ని బలంగా వ్యతిరేకించిన సంగతి తెలంగాణ వాదులందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి కుమార్తె.. తెలంగాణలో వైఎస్ పాలనను అందిస్తానంటూ  రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించడమే విశేషం అనుకుంటే.. అంతటితో ఆగకుండా ఆమె సుదీర్ఘ పాదయాత్ర చేశారు.   జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తో విభేదించి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సమయంలో షర్మిల అన్నకు అండగా ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కే మద్దతు పలికారు. అక్రమాస్తుల కేసులో  అన్న జగన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు... ఆమె ‘నేను జగనన్న వదిలిన బాణం’ అంటూ మూడు వేల కిలోమీటర్ల పాద యాత్ర చేశారు. వైసీపీని బతికించారు. అయితే  ఏపీలో  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న వదిలిన బాణాన్ని జగనన్న వదిలేశారో .. లేదా బాణమే జగనన్నను వదిలేసిందో తెలియదు కానీ  పుట్టింటిని వదిలి మెట్టి నింటికి చేరుకున్నారు.

తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి ఆమె తెలంగాణలో అధికారంలో ఉన్న   బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసేఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తనదైన ప్రత్యేక పంథాలో పోరాటం సాగిస్తున్నారు.పాదయాత్రలు చేస్తున్నారు. 

అయితే  ఇప్పుడు షర్మిల త్వరలోనే, వైఎస్సారు టీపీని  కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తారనే  ప్రచారం జోరుగా సాగుతోంది.   అయితే షర్మిల మాత్రం ఇంత కష్టపడి పార్టీని నడిపించిన తాను, పార్టీని ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నా.. ఆమె ‘అడుగులు’ మాత్రం విలీనం దిశగానే కదులుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.  అలాగే టీపీసీసీ నేతలు  షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అన్న అంశంపై చర్చోపచర్చలు చేస్తున్నారు.  

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తర్వాత కొద్ది రోజులు సాగిన ఈ  ప్రచారం మధ్యలో కొంత బ్రేక్ తీసుకుంది. కానీ, ఇప్పడు తాజాగా   మరో మారు ఆ ప్రచారం జోరందుకుంది. అంతే కాదు షర్మిల చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు. హస్తినలో సోనియాగాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీని విలీన ప్రకటన చేస్తారని చెబుతున్నారు.  కాంగ్రెస్‌లోకి రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే అక్కడ పార్టీ కొంతవరకు తేరుకోవడానికి ఉపయోగపడుతుందనే అభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే సీనియర్ నాయకుడు వీహెచ్ లు తెలంగాణ కాంగ్రెస్ లో షర్మిల వేలు పెడితే అంగీకరించేది లేదని ఇప్పటికే కుండబద్దలు కొట్టేశారు.

అయితే పార్టీలో తమ ప్రాబల్యాన్ని పెంచుకుని, రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు పావులు కడుతున్న.. భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి వైఎస్ ఫ్యామిలీపై ఉన్నగౌరవంతో షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చి తెలంగాణలో క్రియాశీలంగా పని చేస్తే బీఆర్ఎస్ ను మరింత బలంగా ఢీకొనే అవకాశాలు మెరుగౌతాయని అంటున్నారు. దీనికి తోడు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలోకి రెడ్ కార్పెట్ పరిచినట్లే అయ్యిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే  కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకొంటుంది,  దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు  ఎలా స్పందిస్తారు, అనేది తెలియ వలసి వుంది. అయితే  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం తాను పీసీసీ అధ్యక్షునిగా ఉన్నంత వరకు  షర్మిలను గాంధీ భవన్ మెట్లు ఎక్కనీయనని భీషణ ప్రతిజ్ణ  చేశారు. అయితే, షర్మిల పైకి ఏమి చెప్పినా, నాలుగు  దిక్కుల నుంచి గాంధీ భవన్ మెట్లు ఎక్కేందుకు చకచకా పావులు కదుపుతున్నారనే పరిశీలకులు అంటున్నారు.  ఇక పోతే కాంగ్రెస్ అధిష్ఠానం, మరీ ముఖ్యంగా  వైఎస్ ఆత్మగా అంతా చెప్పే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు మాత్రం షర్మిల కాంగ్రెైస్ లో చేరి ఏపీ పగ్గాలు చేపట్టాలనీ, తద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ బలోపేతమయ్యే అవకాశలు ఉంటాయనీ భావిస్తున్నారు. ఆ దిశగా షర్మిలను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ మొదలు రాహుల్ గాంధీ వరకు, పొంగులేటి, కోమటి రెడ్డి మొదలు ఇతర సీనియర్ నాయకులు అందరితోనూ వైఎస్ కుటుంబ బంధాలను పునరుద్దరించే ప్రయత్నాలు షర్మిల సాగిస్తున్నారు. గతంలో బెంగుళూరు వెళ్లి మరీ డీకేకు వెళ్లి మరీ   అభినందనలు తెలిపిన షర్మిల, గతంలో ఎప్పుడు లేని విధంగా రాహుల్‌గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే, షర్మిల పాదాలు కాంగ్రెస్ దిశగా నడక సాగిస్తున్నాయన్నది తేటతెల్లమౌతోంది. అయితే.. వైఎస్ వారసురాలిగా.. ఆమె ఏపీలో  ఎక్కువ ప్రభావం చూపగలుగుతారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. జగన్ సర్కార్ విధానాల కారణంగా ప్రజలలో  వైసీపీ పట్ల వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకత.. షర్మిల కాంగ్రెస్ నాయకురాలిగా ఏపీలో అడుగుపెడితే అది కాంగ్రెస్ కు సానుకూలంగా మారుతుందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపునకు మళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.   

By
en-us Political News

  
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.