Publish Date:Oct 16, 2026
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతకొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కూటమి సీట్ల పంచాయితీకి ఎట్టకేలకు తెరపడింది. ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు మూడు పార్టీలు ఎక్కడెక్కc ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలో స్పష్టత వస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. తాజా లెక్కల ప్రకారం, జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 4 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే మిత్రపక్షమైన బీజేపీకి 2 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, క్షేత్రస్థాయిలో తమ ప్రాబల్యాన్ని బట్టి కనీసం 40 శాతం సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబ ట్టినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ పార్టీ అధినేతతో చర్చించి జనసేనను. 20 శాతం లోపు సీట్లకే పరిమితం కావడానికి ఒప్పించారు. మరోవైపు బీజేపీ పెద్దగా పట్టుబట్టకపోయినా, రాజమండ్రి, అనంతపురం కార్పొరేషన్లతో పాటు 7 మున్సిపాలిటీలను కేటాయించడం గమనార్హం. రాజమండ్రిలో లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఆ సీటు ఇవ్వడం సహజమే అయినప్పటికీ, అనంతపురం కార్పొరేషన్‌ను కూడా కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
చంద్రబాబు తన వ్యూహాత్మక రాజకీయాలతో జనసేనను ఆ పార్టీ కోరినన్ని స్థానాల కోసం పట్టుబట్టకుండా ఒప్పించగలిగారని పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు తనదైన శైలిలో కూటమిలో సీట్ల సర్దుబాటును పూర్తి చేసి తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు.
[Ap Localbody Elections, Telugudesham Kutami Seat Sharing, Janasena TDP BJP AP Politics Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-localbody-elections-25-234534.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.