వృద్ధ పెన్షనర్లకు అదనపు పింఛన్ పెంపు.. ఎప్పటి నుంచి అమలంటే?

Publish Date:Sep 22, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయో వృద్ధ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.  ఏడు పదుల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లకు మరింత ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. వయసు ఆధారంగా అందించే అదనపు పింఛన్ శాతాన్ని పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ తాజా నిర్ణయం  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది వృద్ధ పెన్షనర్లకు  ఆర్థిక ప్రయోజనం చేకూర్చనుంది.  వయసు పెరుగుతున్న కొద్దీ వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటించిన ఈ అదనపు పింఛన్ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. 

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. ఇప్పటివరకు అమల్లో ఉన్న అదనపు పింఛన్ విధానాన్ని సవరించారు. గతంలో 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు ఇస్తున్న అదనపు పింఛన్‌ శాతాన్ని 7 శాతం నుంచి   10 శాతానికి పెంచారు. అలాగే, 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్ల కోసం అందించే అదనపు పింఛన్‌ను గతంలో ఉన్న 12 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ  ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.  

ఈ పెంపునకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు డిసెంబర్ నుంచి అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఈ పెరిగిన అదనపు పింఛన్ డిసెంబర్ నెల నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి లబ్ధిని జనవరి మొదటి తేదీ నుంచి పెన్షనర్ల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల వృద్ధులకు ఆర్థికంగా తోడ్పాటు లభిస్తుందని, వారి దైనందిన అవసరాలను తీర్చుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది.  

ప్రభుత్వం తీసుకున్న ఈ  నిర్ణయాన్ని రిటైర్డ్ ఉద్యోగులు,  పెన్షనర్లు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవిత చరమాంకంలో వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ అదనపు ఆర్థిక సహాయం ఎంతగానో ఉపకరిస్తుందని వారంటున్నారు.  గత కొంతకాలంగా వృద్ధాప్య పింఛన్ల క్రమబద్ధీకరణపై  ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ సర్కార్.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, కాలానికి తగుట్టుగా ప్రయోజనాలను సవరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే సీనియర్ సిటిజన్ల వయసు కేటగిరీలను పరిగణలోకి తీసుకుని ఈ అదనపు మొత్తాన్ని పెంచడం జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.


[AP Government Pension Increase, Additional Pension AP, Elderly Pensioners AP, AP News Telugu, Pension Hike, Telugu One]  

By
en-us Political News

  
ర్షాలు తగ్గడంతో వరద సాధారణ స్థితికి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ చెప్పారు. ఆయన అంచనా వేసినట్లుగానే బహుదాలో వరద తగ్గుముఖం పట్టింది. నదుల్లో ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున తీర ప్రాంత, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కాలువలు, నదుల వద్దకు చేపల వేటకు, స్నానాలకు  వెళ్లరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. 
తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు.
పలు గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధనంలోనే ఉన్నాయ.  రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారులతో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తుపాను ధాటికి ఆయా ప్రాంతాలలో జరిగిన ఆస్తి, పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధితుల పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు.  తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలలోని పునరావస కేంద్రాలకు తరలించడం, మునిగిపోయిన ప్రాంతాలలో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.  
ఈ అల్పపీడనం  పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తూ అండమాన్, అండమాన్ నికోబా దీవుల సమీపంలో  తుపానుగా బలపడే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత  ఇది మరింత బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో  వచ్చే నెల  1, 2 తేదీలలో కోస్తాంధ్రతో పాటు పలు ప్రాంతాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం సమష్టి కృషితో ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామన్న సీఎం.. అవిశ్రాంతంగా శ్రమించిన అధికారులు, యంత్రాంగాన్ని అభినందిస్తూనే..   విపత్తు ప్రభావం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకునే వరకు  నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.