కసిరెడ్డి ఇన్ యాక్షన్.. కొత్త పోలీస్ బాస్‌పై ఫోకస్..
Publish Date:Feb 21, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఫ్యాన్ పార్టీకీ పోలీసు శాఖ సపోర్ట్ మస్త్ మస్త్‌గా ఉందనే టాక్ అయితే బాగానే వైరల్ అయింది. సకల శాఖల మంత్రి సజ్జల మాట.. డీజీపీ సవాంగ్ బాట.. అన్న టాక్ కూడా గట్టిగా వినిపించింది. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా జరిగినా... సంక్రాంతికి కేసినో వ్యవహారం నడిచినా.. ప్రతిపక్షం ఎంతగా విమర్శలు చేసినా.. పోలీసుల నుంచి నిల్ యాక్షన్ అనే విమర్శ ఉంది. పైగా, టీడీపీ వాళ్లు దొరికినా, దొరక్కపోయినా కేసులు, అరెస్టులపై మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక, ఏపీలో శాంతి భద్రతలు పరిస్థితిపై ప్రజల్లో ఓ విధమైన అభద్రతా భావం నెలకొని ఉంది. గౌతమ్ సవాంగ్‌ను డీజీపీ పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని జగన్ ప్రభుత్వం నియమించడంతో.. కొత్త పోలీస్ బాస్ మీద అందరి ఫోకస్ పడింది. పోలీస్ శాఖపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం అంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ అంశంపై టీడీపీ నేతలు చాలా విమర్శలే గుప్పించారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో ఆయన జోక్యాన్ని దాదాపుగా తగ్గించి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయనే ఊహాగానాలైతే ఊపందుకోన్నాయని సమాచారం. మరోవైపు పోలీసు శాఖకు పూర్వవైభవం తీసుకు వచ్చేందుకు కొత్త డీజీపీ కసిరెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో తన టీమ్‌ను సిద్దం చేసుకోవడంలో కొత్త డీజీపీ బిజీ అయ్యారట. హెచ్‌ఓడీల నుంచి జిల్లా ఎస్పీల వరకు అందరిని బదిలీ చేయడానికి ఆయన కార్యాచరణ సిద్దం చేశారని.. దీనిపై సీఎం జగన్ సంతకం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పోలీస్ శాఖలో డీజీపీ తర్వాత నిఘా విభాగం అధిపతి పదవి అత్యంత కీలకమైందీ. ఈ నేపథ్యంలో ఈ పదవిలో సీఎం జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన ఓ సీనియర్ ఐపీఎస్‌ను నియమించనున్నట్లు సమాచారం. ఇక ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల ఎస్పీల పని తీరు... వారిపై ఆరోపణలు, ప్రజలతో వారి నెరపుతోన్న సంబంధాలు, అధికార పార్టీ నేతలతో కనక్షన్లు.. ఇలా ప్రతి అంశాన్ని కొత్త పోలీస్ బాస్.. పరిశీలిస్తున్నారని.. అందుకు సంబంధించి దస్త్రాలన్నీ.. ఇప్పటికే డీజీపీ కసిరెడ్డి సార్ బల్లపైకి చేరినట్లు తెలుస్తోంది. వాటిని పరిశీలించే పనిలో పెద్ద సార్ నిమగ్నమైనట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో అయిదు రేంజీల డీఐజీల్లో నలుగురిని స్థాన చలనం తప్పకపోవచ్చుననే చర్చ అయితే డీజీపీ కార్యాలయం సాక్షిగా సాగుతోంది. పోలీస్ శాఖకు చెందిన జైళ్లు, పోలీస్ ట్రైనింగ్ కాలేజీలతోపాటు పలు కార్పొరేషన్లలో కొనసాగుతున్న ఐపీఎస్‌లకు సైతం స్థానం చలనం కలుగుతోందని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా తన బ్యాచ్‌మెట్‌ను తీసుకోవాలని కొత్త డీజీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీస్‌శాఖను సమయత్తం చేసే దిశాగా కొత్త డీజీపీ సార్.. కృత నిశ్చయంతో అడుగు వేస్తున్నట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/ap-dgp-in-action-39-132092.html





