‘కమలం’ కోర్ కమిటీపై కిరికిరి!

Publish Date:Nov 6, 2020

Advertisement

సునీల్-మధుకర్ ఏం చేస్తున్నట్లు?

 

సస్పెన్షన్లు, సమావేశాలపై చర్చించరేం?

 

సొంత నిర్ణయాలపై నేతల సీరియస్

 

క్రమశిక్షణ ఆరోప్రాణంగా చెప్పబడే భారతీయ జనతా పార్టీలో.. ఇప్పుడు అదే లోపించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమిష్ఠి నిర్ణయాల స్ధానంలో,  ఒకరిద్దరు తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్లతోపాటు, కొత్తగా పార్టీలో చేరిన నేతలు భగ్గుమంటున్నారు. పార్టీపరంగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్న నాయకత్వం, వివాదాల్లో మాత్రం శరవేగంగా దూసుకుపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా.. కోర్ కమిటీ రూపకల్పన, ఆ పేరుతో పిలుస్తున్న ఆహ్వానితుల జాబితాపై పార్టీ ఎంపీలు సైతం రుసరుస లాడుతున్నారు.

 

ఏపీ బీజేపీలో లుకలుకలు పెరుగుతున్నాయి. సస్పెన్షన్లు, మీడియా చర్చలకు వెళ్లే ప్రతినిధుల జాబితా కూర్పుపై.. రాష్ట్ర అధ్యక్షుడు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోము వీర్రాజు అధ్యక్షడయి చాలాకాలమయింది. అయినా ఇప్పటివరకూ, కోర్ కమిటీ కూర్పుపై.. సీనియర్లతో సమావేశం నిర్వహించకపోవడంపై, అగ్రనేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కోర్ కమిటీ ఏర్పాటుచేస్తే, అందులో కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏకపక్ష నిర్ణయాలకు అవకాశం తక్కువగా ఉంటుంది. అందువల్లనే, కోర్ కమిటీ ఏర్పాటుచేయకుండా, కేవలం ఒకరిద్దరే స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

 

కోర్ కమిటీ ఏర్పాటుచేస్తే, అందులో తమ నిర్ణయాలను ప్రతిఘటన ఉండే ప్రమాదం ఉన్నందున, సాధ్యమయినంత వరకూ ఆలస్యం చేసి, ఈలోగా కావలసిన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ముగ్గురు ఎంపీలు రాష్ట్ర నాయకత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందున, వారిని కోర్ కమిటీలో లేకుండా చూసేందుకే ఆలస్యం చేస్తున్నారంటున్నారు.

 

ఇటీవల విశాఖలో ఏర్పాటుచేసిన కోర్ కమిటీ సమావేశానికి.. యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావును మాత్రమే పిలిచి, రాష్ట్ర ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఆహ్వానించకపోవడం వివాదానికి దారితీసింది. అసలు సాంకేతికంగా ఏపీతో ఏమాత్రం సంబంధం లేని జీవీఎల్, కోర్‌మిటీలో ఎలా సభ్యుడవుతారన్న ప్రశ్నలు వినిపించాయి. ఇన్చార్జి సునీల్ దియోధర్, సంఘటనా కార్యదర్శి నూకల మధుకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కేవలం జీవీఎల్ సూచనల ప్రకారం పనిచేస్తున్నారని, ప్రస్తుతం పార్టీని జీవీఎల్లే నడిపిస్తున్నారన్న  వ్యాఖ్యలు, పార్టీ నేతల అంతర్గత సమావేశాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. కొత్త కమిటీ వేయనందున, గతంలో వేసిన కోర్ కమిటీ ఇప్పుడు పనిచేస్తుందా? లేదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కోర్‌కమిటీలో సబ్ కమిటీ వేసి, మళ్లీ దానిపై ఇంకో మినీ కోర్ కమిటీ వేసినట్లున్నారన్న వ్యంగ్య వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 

ఇటీవలి విశాఖ భేటీలో.. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ వ్యాఖ్యలు చర్చకు వచ్చాయట. ఆమెను ఓ ప్రధాన కార్యదర్శి విమర్శించడం మంచిదికాదని, మహిళలకు గౌరవం ఇవ్వాలని, భేటీలో పాల్గొన్న పురందీశ్వరి మందలించారట. అయితే అక్కడే ఉన్న రాష్ర్ట ఇన్చార్జి సునీల్ దియోధర్ మాత్రం, అందుకు భిన్నంగా.. ప్రధానిని వాడు, వీడు అని సంబోధించినా ఎవరూ స్పందించలేదని, ఒక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాత్రమే స్పందించారని మెచ్చుకున్నారట. అయితే అసలు సుంకరపద్మశ్రీ ప్రధానిని దూషిస్తూ, ఏ పత్రికలు, చానెళ్లలో వచ్చిందో తాము చూడలేదని, ఆ పేరుతో ప్రధాన కార్యదర్శి మహిళను దూషిస్తే, ఆయనను సునీల్ సమర్థించడంపై నేతలు విస్మయం వ్యక్తం చేశారట.

 

ఇక పార్టీ వాణి బలంగా వినిపించే ఓవి రమణ, వెలగపూడి గోపాలకృష్ణ, తాజాగా లంకాదినకర్‌ను సస్పెండ్ చేసిన సందర్భంలో.. నాయకత్వం తమను సంప్రదించకపోవడంపై సీనియర్లు, ఎంపీలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ ముగ్గురు చేసిన తప్పేమిటో చెప్పకుండా, నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీసు ఇవ్వకుండా.. ఏకంగా సస్పెండ్ చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. వీరిలో రమణ,అమరావతిపై పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలనే పత్రికలో వ్యాసం రాయగా, ఆయనపై వేటు వేశారు. ఇక పార్టీ ఆఫీసుకు వెయ్యి గజాల స్థలం ఇచ్చి, ఆఫీసు కూడా నిర్మించేందుకు సిద్ధమయిన వెలగపూడి గోపాలకృష్ణ,  తనను తాను చెప్పుతో కొట్టుకుంటే..  ఆయనపైనా వేటు వేశారు.అయితే.. ఆయనను వెంటనే జాతీయ హిందూమహాసభకు, రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంతో బీజేపీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది.

 

జాతీయ మీడియాలో పార్టీ వాణిని,  సమర్థవంతంగా వినిపిస్తున్న లంకా దినకర్‌పై వేటు వ్యవహారమయితే.. ఢిల్లీ వరకూ వెళ్లింది. జాతీయ నాయకులు సైతం ఆయనపై వేటు వార్త విని ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఇద్దరు ఎంపీలు కూడా.. దీనిపై అధ్యక్షుడు నద్దా, పార్టీ  సంఘటనా జాతీయ ప్రధాన కార్యదర్శి, సంయుక్త ప్రధాన కార్యదర్శికీ  ఫిర్యాదు చేశారట. స్వయంగా నద్దా సమక్షంలోనే పార్టీలో చేరిన లంకాదినకర్ వంటి వారికే దిక్కు లేకపోతే, ఇక తమ పరిస్థితి ఏమిటని,  ఇతర పార్టీల నుంచి చేరిన నేతలు బిక్కుబిక్కుమంటున్నారట.

నిజానికి జాతీయ మీడియాలో కనిపించే జీవీఎల్ కంటే, దినకర్ వాదనలోనే ఎక్కువ రుజువులు, ఆధారాలుంటాయన్న ప్రశంసలు వినిపిస్తుంటాయి. బహుశా దినకర్‌కు అదే శాపంగా మారిందన్న వ్యాఖ్యలు కూడా వినిపించకపోలేదు.  ప్రధానంగా.. టీడీపీ నుంచి చేరిన కమ్మ వర్గానికి చెందిన నేతలను,  ఒక వ్యూహం ప్రకారం వెళ్లగొడుతున్నారన్న ప్రచారం పార్టీవర్గాల్లో వినిపిస్తోంది.

 

ఇక వివిధ చానెళ్ల చర్చలకు వెళ్లే ప్రతినిధుల జాబితాపైనా,  పార్టీ వర్గాల్లో వెటకారపు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సోమనాధ్ ఆలయం ఎక్కడుందో కూడా చెప్పలేని వారిని, టీవీ చర్చలకు ప్రతినిధులుగా ఎంపిక చేసిన, పార్టీ మేధావులను మెచ్చుకోవాల్సిందేనంటున్నారు. అసలు ఆ జాబితాలో ముప్పావుశాతం మందికి, ఇప్పటిదాకా చానెళ్లలో చర్చలకు వెళ్లిన అనుభవమే లేదని గుర్తు చేస్తున్నారు. మంత్రిగా పనిచేసిన రావెల కిశోర్‌బాబు, ఆదినారాయణరెడ్డి వారితో నిత్యం మీడియా ప్రతినిధులు మట్లాడుతుంటారు. కానీ వారికి ఇప్పుడు గొంతు విప్పే అవకాశం లేకుండా పోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాయలసీమలో ఒకస్థాయిలో ఇమేజ్ ఉన్న ఆదినారాయణరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి స్థానం లేకుండా పోవడం ఏమిటంటున్నారు. టీడీపీ-బీజేపీ సంకీర్ణ సర్కారు కాలం నుంచీ, పార్టీ వాణిని సమర్ధవంతంగా వినిపిస్తున్న పురిఘళ్ల రఘురాం వంటి.. సీనియర్ నాయకుడినే జాబితా నుంచి తప్పించడంపై,  పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 

సునీల్ దియోధర్ ఆయనకు, ప్రాధాన్యం తగ్గించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  జాతీయ నాయకత్వంతో సన్నిహితంగా ఉండటంతోపాటు, ఏపీ-తెలంగాణకు చెందిన పార్టీ నేతలకు ఢిల్లీలో ఏళ్లతరబడి.. సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న రఘురాం లాంటి వంటి కార్యదక్షులనే పక్కకుపెడితే, ఇక మామూలు నేతల సంగతేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

 

పార్టీని చక్కదిద్దాల్సిన రాష్ట్ర పార్టీ సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డిజీ, ఆ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన తన విచక్షణ వినియోగించడం మానే సి, కేవలం ఇద్దరు ముగ్గురు నేతల ఆలోచన ప్రకారమే, నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్‌డి విల్సన్, పురిఘళ్ల రఘురాం, లంకా దినకర్‌పై సస్పెన్షన్- నోటీసులివ్వాలని సునీల్ దియోధర్ చే సిన ఒత్తిళకు, మధుకర్‌రెడ్డి గట్టిగా సమాధానం ఇవ్వలేకపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.