మాటలతోనే మెస్మరైజ్.. చేతలపై పట్టింపేది?

Publish Date:Apr 15, 2022

Advertisement

కేసీఆర్ వాగ్దానాల వరదకు సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఫిదా అయిపోయారు. న్యాయ వ్యవస్థలో ఏకంగా నాలుగు వేల మూడు వందల ఇరవై ఉద్యోగాలను సృష్టించడం ద్వారా కేసీఆర్  ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారనీ, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లాంటిదాన్ని కూడా ఏర్పాటు చేయడం, అందుకు స్థలం, నిధులు కేటాయించడం ద్వారా న్యాయ వ్యవస్థకు కేసీఆర్ నిజమైన మిత్రుడిగా నిలిచారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్బిట్రేషన్ సెంటర్ కు స్థలం, నిధులు కేటాయించడం సరే.. కొత్తగా నాలుగు వేల ఉద్యోగాల కల్పన హామీకే సీజేఐ ప్రశంసల వర్షం కురిపించేలా ఇంప్రెస్ అవ్వడం మాత్రం కేసీఆర్ మాటల మ్యాజిక్ ఘనతే. ఎందుకంటే... 

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మాటల మాంత్రికుడిగా అందరూ అభివర్ణిస్తుంటారు.  ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాగ్దానాలతో, విపక్షాలపై సరికొత్త ఆరోపణలు విమర్శలతో కేసీఆర్ గత ఏనిమిదేళ్లుగా చేస్తున్న విన్యాసాలు ఇప్పటి వరకూ ఆయనకూ, ఆయన పార్టీ టీఆర్ఎస్ కు మేలు చేస్తూ వస్తోంది. అయితే గత ఏడాదిన్న కాలంగా మాటల మాంత్రికుడి మాటల మ్యాజిక్ ఒకింత మసక బారుతూ వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు,  హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.  విప్లవాత్మకంగా కేసీఆర్ అభివర్ణించి, అటువంటి పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు తన భుజాలను  తానే చరుచుకున్నదళిత బంధు పథకం కూడా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను గట్టెక్కించలేకపోవడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. అయినా కూడా కేసీఆర్ తన మాటల గారడీనే నమ్ముకున్నాడు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా హీట్ పెంచుతున్న బియ్యం వివాదమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హస్తినలో బియ్యం ధర్నాలో కేంద్రానికి 24 గంటల అల్టిమేట్ ఇచ్చి.. ఆ గడువు తీరకముందే.. యాసంగి బియ్యం మొత్తం రాష్ట్రమే కొంటుందని నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ కే చెల్లు. కేంద్రంలోని మోడీ సర్కార్ ను, అదే సమయంలో  రాష్ట్రంలో ప్రతి నిర్ణయం విషయంలో తనతో విభేదిస్తున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకే అనూహ్యంగా యాసంగి బియ్యం కొనుగోలు నిర్ణయం తీసుకున్నారన్న విపక్షాల విమర్శలలో వాస్తవం లేకపోలేదు.  

అయినా సీఎం కేసీఆర్.. వాగ్దానాలు అయితే చేసేస్తారు.. అవి అమలయ్యాయా లేదా అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇందుకు ఈ ఎనిదిమేళ్ల కాలంలో చాలా ఉదాహరణలే చెప్పవచ్చు. తాజాగా ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసిన ఉద్యోగ ప్రకటనను తీసుకుంటే... ఇప్పటి వరకూ అందుకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడలేదు. ఆయన ప్రసంగిస్తూ తొలి నోటిఫికేషన్ వెంటనే... అంటే ఆయన ప్రసంగిస్తున్న రోజు సాయంత్రానికే వెలువడుతుందని కూడా చెప్పేశారు. కానీ అది ఆచరణ రూపం దాల్చలేదు. అయినా ఇచ్చేసిన, చేసేసిన వాగ్దానం గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారికి పెద్దగా పట్టింపు ఉండదు. జనం ఆ వాగ్దానం గురించి నిలదీసే అవకాశమే ఇవ్వరాయన. అందుకే ఉద్యోగాల భర్తీ వాగ్దానం నుంచి జనం దృష్టి మళ్లించడానికి ధాన్యం కొనుగోలు వాగ్దానాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. 

తెలంగాణ తొలి సీఎంగా దళితుడు, ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆ జాబితా ఎప్పటికీ పూర్తి కాదనిపించేటన్ని వాగ్దానాలు ఈ ఎనిమిదేళ్ల వ్యవధిలో కేసీఆర్ నోటి వెంట వచ్చాయి. ఇప్పుడు న్యాయవ్యవస్థలో నాలుగు వేల పైచిలుకు ఉద్యోగాల హామీపై కేసీఆర్ పై సీజేఐ ప్రశంసల జల్లు కురపిస్తున్నారు. అయితే నోటిఫికేషన్ వెలువడి.. ఆ ఉద్యోగాలు భర్తీ అయ్యేదెన్నడన్న నిరుద్యోగుల సందేహాం మాత్రం నివృత్తి కావడం లేదు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.