సీఎం జగన్ పాలనపై అన్నివర్గాలు అసహనంతో రగిలిపోతున్నాయి. తమ బతుకులు రోడ్డుపాలు చేస్తున్న ముఖ్యమంత్రిపై అసహనంతో రోడ్డెక్కుతున్నాయి. అందుకే, జగన్‌కు వ్యతిరేకంగా ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా.. అది భారీ సక్సెస్ అవుతోంది. ఏ వర్గం ఆందోళనకు పిలుపిచ్చినా వేలాదిగా జనం కదిలివస్తున్నారు. జగనన్నపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
ఇటీవల పీఆర్సీ-జీతాల తగ్గింపునకు వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు చలో విజయవాడకు పిలుపిచ్చారు. అదే రేంజ్లో సక్సెస్ అయిందో అంతా చూశారు. ఇసుకేస్తే రాలనంతగా ఉద్యోగులు తరలివచ్చి విజయవాడను ఎరుపెక్కించారు. చలో విజయవాడతో ఉద్యోగుల సెగను తట్టుకోలేక.. జగనన్న దిగొచ్చారు. హెచ్ఆర్ఏ కాస్త పెంచి మమ అనిపించారు.
కట్ చేస్తే.. లేటెస్ట్గా కనీస వేతనం అమలు చేయాలనే డిమాండ్‌తో విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ సరస్వతి పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.
తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తానని పాదయాత్ర సమయంలో సీఎం జగన్ చెప్పారని అంగన్వాడీలు గుర్తు చేశారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని.. తక్షణం ప్రభుత్వం స్పందించి వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విశాఖలో నిరసనకు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు తరలివచ్చారు. ఎర్రజెండాలతో విశాఖను ఎరుపెక్కించారు. వీళ్లంతా కేవలం ఒక్క జిల్లాకు చెందిన అంగన్వాడీలే. అదే.. ఏపీ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు కనుక చలో విశాఖకు పిలుపు ఇచ్చి ఉంటే.. మరో చలో విజయవాడలా జగన్ సర్కారును షేక్ చేసి ఉండేదని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో ఇలాంటి నిరసన కార్యక్రమాలతో తేటతెల్లం అవుతోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anganvadies-in-vishaka-25-132702.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి