'మూడు' లేన‌ట్టే.. అమ‌రావ‌తి బ‌దులు హైద‌రాబాద్ వ‌చ్చే!!

Publish Date:Mar 7, 2022

Advertisement

ఇంతకీ, ఏపీ ప్రభుత్వం మనసులో ఏముంది? రాజధాని అమరావతి విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును, ప్రభుత్వం ఆమోదిస్తుందా, లేదు, మూడు రాజధానుల విధానానికే కట్టు బడి ఉంటుందా? ఇప్పుడు ఈ ప్రశ్న మరోమారు ప్రముఖంగా చర్చకు వచ్చింది. నిజమే, న్యాయస్థానం తీర్పు వచ్చిన తర్వాత కూడా, ముఖ్యమంత్రి ‘మూడు’ మారలేదు. అయన మౌనంగానే ఉన్నారు. కానీ’ మంత్రులు, అధికార పార్టీ సీనియర్ నాయకులు, మూడు రాజధానులే మా విధానం అని ప్రకటిస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే, మూడు రాజధానుల తాజా బిల్లు ప్రవేశ పెడతామని చూచాయగా ప్రకటించారు. 

అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఆ ప్రస్తావన లేదు. గడిచిన మూడేళ్లుగా పాలన వికేంద్రీకరణపైనే తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని మాత్రేమే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు. అంతేకానీ, మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బొత్స, ఇతర మంత్రులు చెపుతున్న మాటను గవర్నర్’తో చెప్పించలేదు. ఆలాగే, మూడు’ కు సంబందించిన తాజా బిల్లును ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశ పెడుతున్నామని ఒక్క ముక్కయినా చెప్పలేదు. గవర్నర్ ప్రసంగం అంటే, గవర్నర్ సొంత ఉపన్యాసం కాదు, కాబినెట్ మోదించిన ప్రసంగ పాఠాన్నే గవర్నర్ చదివి వినిపిస్తారు. అంటే, మూడు మీద మంత్రులు ఏమి మాట్లాడినా ప్రభుత్వం ఇంకా ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేదని, అందుకే గవర్నర్ ప్రసంగంలో ఆ అంశాన్ని చేర్చలేదని, దాట వేశారని అనుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  

ఆదలా ఉంటే, గవర్నర్ ప్రసంగంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ, మూడుకు మరో ముడి వేశారు. కోర్టు తీర్పుకు కొత్త భాష్యం చెప్పారు. “2024 వరకు మన రాజధాని హైదరాబాదే. దాన్ని ఆధారంగా చేసుకునే బహుశా కోర్టులు ఆలా మాట్లాడి ఉంటాయి. ఎందుకంటే.. రాజధానిని మేం గుర్తించిన తర్వాత.. చట్టం చేసి.. పార్లమెంట్‌కు పంపి.. అక్కడ ఆమోదం పొందిన తర్వాత తెలుస్తుంది. అయితే అమరావతి, హైదరాబాద్ అని రెండు రాజధానులు లేవు. మా ప్రభుత్వం ప్రకారం అమరావతి అనేది శాసన రాజధాని మాత్రమే” అని బొత్స వ్యాఖ్యానించారు. 

అయితే, బొత్స సత్యనరాయణ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినా, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు శ్రీకారం చుట్టాయి, నిజానికి, ఇప్పుడు హైదరాబాద్’ ఉమ్మడి రాజధాని అంటే, ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీ భవనాలు సహా, హైదరాబాద్’లో ఉన్న ఉమ్మడి ఆస్తులు చాలా వరకు  జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వానే తెలంగాణకు ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ భవనాన్ని కూల్చి వేసి, కొత్త భవనాలు కట్టుకుంటోంది. సో... హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనుకోవడం, ఆ విధంగా ప్రకటనలు చేయడం అయితే, మంత్రి బొత్స అజ్ఞానం అయినా అవుతుంది, కాదంటే, అటూ ఇటూ ఏటూ తేల్చుకోలేక చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం అయిన కావచ్చునని పరిశీలకులు అంటున్నారు. అయితే, బొత్స వ్యాఖ్యలు ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ హాట్ టాపిక్ అయ్యాయి.ఇటీవల ప్రధాని లోక్ సభలో రాష్ట్ర విభజనకు సంబంధించి చేసిన ప్రసంగాన్ని, తెరాస నాయకత్వం తెలంగాణ సెంటిమెంట్’ను రాజేసేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు బొత్స ప్రకటనను కూడా అలాగే, ఉపయోగించుకున్నా ఉపయోగించుకుంటుంది, అంటున్నారు.

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.