ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సుదీర్ఘంగా సాగాయి. మోదీ-యోగీ ద్వయం బాగా చెమటోడ్చింది. సమాజ్‌వాదీ పార్టీ వేగంగా పుంజుకుంది. ప్రియాంకగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అదృష్టం పరీక్షించుకుంది. పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. అందరికంటే, అధికార బీజేపీ మరింత కష్టపడింది. మోదీ గ్రాఫ్ పడిపోవడం.. రైతు చట్టాలు, రైతు హత్యలు.. యోగి వివాదాస్పద అంశాలు.. ఇలా కమలనాథులకు యూపీ ఎలక్షన్స్ అగ్నిపరీక్ష పెట్టాయి.
ఆ పరీక్ష ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎమ్లలో భద్రంగా ఉంది. లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ ఉత్కంఠ కంటిన్యూ కానుంది. అయితే, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ముందే కూస్తున్నాయి. గెలుపెవరిదో స్పష్టంగానే చెబుతున్నాయి. ఈసారి బీజేపీ గట్టెక్కడం కష్టమనే అనుకుంటున్నారంతా. కాకపోతే టఫ్ ఉన్నా.. ఎలాగోలా బయటపడుతామనే ఆశ కమలనాథుల్లో. అయితే, ఆ ఆశా అడియాశే అంటోంది ఎగ్జిట్ పోల్. యూపీలో వార్ వన్‌సైడ్‌గా జరిగినట్టు అంచనా వేసింది. కషాయదళంకు ఓటర్లు కర్రు కాల్చి వాతపెట్టబోతున్నారంటూ హింట్ ఇస్తోంది. యూపీలో బీజేపీకి దారుణ పరాజయం తప్పదంటున్నాయి ఎగ్జిట్ పోట్స్.
హైదరాబాద్‌కి చెందిన ఆత్మసాక్షి గ్రూప్.. యూపీ ఎలక్షన్స్‌పై ఎగ్జిట్‌పోల్స్ రిలీజ్ చేసింది. ఆ ఫలితాలు సంచలనంగా ఉండబోతున్నాయని తెలిపింది. బీజేపీ కేవలం 138-140 సీట్లకే పరిమతం అవుతుందని అంటోంది. మోదీ-యోగిల మాయ ఈసారి యూపీలో వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. సమాజ్‌వాది-ఎస్పీ పార్టీ మాత్రం 235-240 సీట్లతో విజయకేతనం ఎగరవేయడం ఖాయమని చెబుతోంది. బీఎస్పీకి 19-23.. కాంగ్రెస్‌కు 12-16 సీట్లు వస్తాయనేది ఆత్మసాక్షి గ్రూప్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/up-exit-poll-results-by-atmasakshi-group-25-132706.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి