ఏపీ అభివృద్దికి సేవలందిస్తా: తెలుగు బిడ్డగా ఆశీర్వదించండి.. అనంత్ అంబానీ.!

Publish Date:Oct 2, 2026

Advertisement

అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా శుక్రవారం (అక్టోబర్ 2) జరిగిన జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అలాగే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ మరియు వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

.ఈ   కార్యక్రమంలో అనంత్ అంబానీ   తెలుగులో ప్రసంగించి సభికులను విస్మయపరిచారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆయన  తనను ఒక పారిశ్రామికవేత్తలా కాకుండా రాష్ట్రానికి చెందిన బిడ్డలా భావించాలని కోరారు. అందమైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాను  సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని, తగిన మార్గదర్శనం చేయాలని ఆయన చంద్రబాబును కోరారు.  రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన రంగానికి పెద్దపీట వేసేలా రిలయన్స్ సంస్థ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందన్న అనంత్ అంబానీ,   ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా స్థానిక రైతన్నలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి, వారిని ఆర్థికంగా మరింత ఉన్నతస్థితికి తీసుకువస్తామన్నారు. 

కేవలం వ్యవసాయాభివృద్ధే కాకుండా గ్రామీణ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తమ ప్రణాళికలు ఉంటాయని స్పష్టం చేశారు.మదనపల్లె గడ్డపైనే రవీంద్రనాథ్ టాగూర్ జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించిన చారిత్రక ప్రాధాన్యాన్ని   ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న అనంత్ అంబానీ,  ప్రధాని నరేంద్ర మోదీ కలలుగన్న వికసిత్ భారత్ సాధనలో దేశంలోని యువతతో పాటు తాము కూడా భాగస్వామ్యం అవుతామన్నారు.   

అనంత్ అంబానీ ప్రసంగం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంత్ కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, మూగజీవాల సంరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. తిరుమల శ్రీవారి సేవలో భాగంగా రిలయన్స్ సంస్థ అందించిన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయనను  తెలుగు ముద్దుబిడ్డగా అభివర్ణించారు.   ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామిక అనుకూల విధానాల వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాయలసీమ రూపురేకలు పూర్తిగా మారిపోవడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పరిశీలకులు అంటున్నారు.  కాగా తెలుగులో తడబాటు లేకుండా మాట్లాడిన అంతన్ అంబానీని చంద్రబాబు ఆత్మీయంగా హత్తుకుని అభినందించారు. 

[Anant Ambani, CM Chandrababu Naidu, Madanapalle Event, Global Horticulture Hub, Indian School of Agriculture, Telugu One]

By
en-us Political News

  
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో అమానుష దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ వైద్యులను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండం
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News
నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.
53 Days Imprisonment Rajahmundry Central,[ CM Chandrababu Naidu, CBN Release, Three Years, TDP, Telugu Desam Party, CBN Gratitude, Gachibowli Stadium, Public Support, Telugu People, Global Telugu Community, 60 Countries, Political Arrest, Nara Bhuvaneswari, Nijam Gelavali, Andhra Pradesh Politics
విద్యార్థినికి అండగా నిలిచిన లోకేష్. గ్రీన్ ఛానల్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి.!
ఓటు వేసిన వెంటనే ఇంటికి వెళ్లాలి.!
గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై   విచక్షణారహితంగా దాడికి  పాల్పడ్డాడు.  చెట్లను కత్తిరించడానికి ఉపయోగించే  ట్రీ కట్టర్ మెషిన్ తో ఆ వ్యక్తి చేసిన దాడి అందరినీ భయాందోళనలకు గురి చేసింది. బెంబేలెత్తించింది.
అయితే, సెక్యూరిటీ నిబంధనలు,  భద్రతా  కారణాలను సాకుగా చూపుతూ షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ యలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె వివాహవేడుకకు అభ్యంతరం చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల అసలు యలహంక ప్యాలెస్ తన ఆస్తి అని కుండబద్దలు కొట్టారు.
పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తనపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారని, ఒకే ఘటనకు సంబంధించి ఇన్ని కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించాలని అధికారులను. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్   పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా,   నిష్పాక్షికంగా   ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.