తండ్రి ఆలయానికి శిల్పి.. కొడుకు హిట్‌ అండ్‌ రన్‌ నిందితుడు..!

Publish Date:Sep 2, 2026

Advertisement

 

గంజాయి మత్తులో ఆనంద్ సాయి కొడుకు వీడియో వైరల్..!

ఒకవైపు తండ్రి తన కళా ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు పొందుతూ, ప్రతిష్ఠాత్మక ఆలయ నిర్మాణానికి రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తే.. మరోవైపు కుమారుడు హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్టై వార్తల్లో నిలిచాడు.  ప్రస్తుతం ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌, టీటీడీ బోర్డు మెంబర్, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆధునిక నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆనంద్ సాయి కుమారుడు సందీప్ ఆనంద్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కానీ ఇప్పుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్ గంజాయి సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది..

ఇక సోమవారం తెల్లవారుజామున సుమారు 4.15 గంటల సమయంలో ఖాజాగూడలోని అంకుర ఆస్పత్రి ఎదురుగా, ఓఆర్‌ఆర్‌ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డును దాటుతున్న బిహార్‌కు చెందిన నంద కిశోర్‌ కుమార్‌ రాయ్‌ను ఓ వాహనం ఢీకొట్టింది. అనంతరం జరిగిన వరుస ప్రమాదాల్లో ఆయన మృతి చెందగా, జైద్‌షా ఖాద్రీ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన రాయదుర్గం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి వాహనాలను గుర్తించారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించి ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను  అరెస్ట్ చేశారు. 

ఆయన ఉపయోగిం‌చిన వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఆనంద్ సాయి పేరు యాదాద్రి ఆలయ ఆధునిక నిర్మాణం తో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆలయ పునర్ని ర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రతిష్ఠా త్మకమైన ఈ ప్రాజెక్టుకు ఆయనను ఎంపిక చేయడంపై అప్పట్లో రాజకీయ, సామాజికై వర్గాల్లో చర్చ కూడా జరిగింది. తెలంగాణలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఆలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకారుడిని ఎంపిక చేయడంపై అప్పట్లో విమర్శలు వచ్చినప్పటికీ.. ఆలయ నిర్మాణంలో ఆనంద్ సాయి పనితనం ప్రత్యేకంగా నిలిచింది. 

ప్రమాదం అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, వాహనం నడిపిన తీరు, ప్రమాదం తర్వాత జరిగిన ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తు న్నారు. కళా రంగంలో తండ్రి సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠ ఒకవైపు ఉంటే.. కుమారుడిపై నమోదైన హిట్‌ అండ్‌ రన్‌ కేసు మరోవైపు చర్చకు దారితీసింది. ఇదిలా ఉండగా మరోవైపు సందీప్ కొడుకు గంజాయి సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది.

 

Anand Sais son Sandeep Anand, Hit and run suspect, Nanda Kishore Kumar Roy, Zaidshah Qadri, CM Revanth reddy, CP Sajjanar, Crime news,  Telugu One, Telugu news
 

By
en-us Political News

  
కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు..!
జీహెచ్‌ఎంసీ కఠిన ఆదేశాలు వెనక అసలు కారణం ఇదే..!
వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!
తెల్లకోటు మాటున నకిలీ వైద్యం..ఐదుగురు ఫేక్ డాక్టర్లు అరెస్ట్‌..!
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సింగరేణి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఫైర్..!
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.