ఉప ఎన్నికల్లో 'గాలి'ప్రభావం
Publish Date:Mar 8, 2012
Advertisement
అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గం ఉప ఎన్నికల్లో గాలి జనార్దనరెడ్డి ప్రభావం కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో గెలిచిన కాపు రామచంద్రారెడ్డి జగన్ పక్షాన చేరి అనర్హత వేటుకు గురయ్యారు. ఈయన గాలి జనార్దనరెడ్డికి మద్దతుదారుడనే విషయం అందరికీ తెలిసిందే. ఒక సందర్భంలో ఆయన అసెంబ్లీలో కూడా గాలి జనార్దనరెడ్డికి అనుకూలంగా మాట్లాడారు. అయితే త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి పోటీచేయడానికి వుత్సాహం చూపడంలేదు. తన బదులు గాలి సామ్రాజ్యంలోని ఒక వ్యక్తిని ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కర్నాటకలోని రాయచూర్ లోక్ సభ ఎంపి పకీరప్ప అల్లుడిని ఇక్కడ నిలిపితే ఆయన గెలుపు బాధ్యతను తాను తీసుకుంటానని కాపు రామచంద్రారెడ్డి జగన్ కు సూచించినట్లు తెలిసింది. దీనికితోడు ఈ నియోజకవర్గంలో వాల్మీకి సామాజికవర్గం ఓటు గణనీయంగా ఉన్నాయని, పకీరప్ప అల్లుడు కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అవడంవల్ల విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆయన జగన్ కు చెప్పినట్లు తెలిసింది. అయితే గాలి జానార్దానరెడ్డి అరెస్ట్, సిబిఐ విచారణల నేపధ్యంలో గాలి సానుభూతిపరులకు టిక్కెట్ ఇస్తే కొత్త అపవాదులు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ భయపడుతున్నట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/anamthapuram-24-12482.html





