అంబటి వాస్తవాలు వెల్లడించాలి : సుబ్రమణ్యం
Publish Date:Jan 9, 2012
Advertisement
రాజమండ్రి : ఎమ్మార్ కుంభకోణంలో అంబటిరాంబాబు వాస్తవాలు వెల్లడించాలని, సీబీఐ ముందు సరైన రీతిలో స్పందించాలని ఏపీఐఐసీ చైర్మన్ ఎస్. సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మార్ అక్రమాలపై అంబటి రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఒకరిసారి అక్రమాలు జరిగాయని, మరోసారి జరగలేదనడం సబబుకాదన్నారు. అంబటి ఏపీఐఐసీ చైర్మన్గా ఉన్న సమయంలో ఆయన సిఫార్సు చేస్తూ రాసిన లేఖలు ఉన్నాయన్నారు.తన తమ్ముడితో పాటు మరికొందరికి అంబటి విల్లాలు ఇప్పించారన్నారు. అంబటి ముద్దాయి కాబట్టే వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. సిబిఐ దర్యాఫ్తు ద్వారా వాస్తవాలు మొత్తం బయటకొస్తాయన్నారు.సిబిఐ ప్రశ్నల కంటే మీడియా ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయన్నా అంబటి వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. అంబటి మీడియాను తప్పుబట్టడం సరికాదన్నారు. తప్పు చేసిన వారి ఎంతటి వారైనా చట్టం ముందు తలొంచక తప్పదన్నారు. వచ్చే నెల 18న ఏపీఐఐసీ బోర్డు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, కొత్త పరిశ్రమల స్థాపన తదితర అంశాలపై చేసే ప్రతిపాదనలపై చర్చిస్తామని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రాయితీలు అందిస్తామన్నారు. గతంలో ఏదైనా పరిశ్రమలకు ఇచ్చిన రెండేళ్లలో అది ప్రారంభం కాకపోతే నిలిపివేసే వాళ్లమని, ప్రస్తుతం ఆ సమయం ఐదేళ్లకు పెంచుతున్నామని చెప్పారు.
http://www.teluguone.com/news/content/amr-scame-24-10784.html





