అమెరికా వర్సెస్ యూరప్.. కారణాలేంటో తెలుసా?

Publish Date:Apr 13, 2026

Advertisement

కంఠంనేని సీతారాం

అంతర్జాతీయ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా  సన్నిహిత మిత్రదేశాలుగా వెలుగొందుతున్న అమెరికా మరియు యూరోపియన్  యూనియన్ మధ్య ప్రస్తుతం తీవ్రమైన విభేదాలు పొడసూపాయి. గతంలో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్  ఉన్న సమయంలో అమెరికా అవలంబించిన కఠిన వైఖరి ఈ విభేదాలకు కారణమని యూరోపియన్ దేశాల మేధావులు గట్టిగా చెబుతుంటారు.  అట్లాంటిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న ఈ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ట్రంప్ దెబ్బతీశారని, ఆయన నిర్ణయాలు కూటమి పతనాన్ని శాసించాయని వారు విమర్శలు గుప్పిస్తున్నారు.   అయితే..  ఈ మొత్తం వ్యవహారం వెనుక కేవలం ఒక వ్యక్తి ప్రమేయం కంటే లోతైన వ్యవస్థాగత కారణాలు ఉన్నాయన్నది ప్రపంచ మేధావులు విశ్లేషిస్తున్నారు. 

వాస్తవానికి..  అమెరికాలో యూరప్ పట్ల పెరుగుతున్న అసంతృప్తికి ట్రంప్ ఒక ప్రతినిధిగా నిలిచారే తప్ప..  పూర్తిగా ఆయన వల్లే ఈ పరిస్థితి వచ్చిందనడం సరికాదని వారి అభిప్రాయం.   యూరోపియన్లు తమను తాము అత్యంత నాగరికులుగా, విద్యావంతులుగా భావిస్తూ అమెరికన్లను తక్కువ చేసి చూసే ధోరణి ఎప్పటి నుంచో ఉంది. కానీ రక్షణ, ఆర్థిక పరమైన అంశాల్లో యూరప్ దేశాలు పూర్తిగా అమెరికాపై ఆధారపడతాయి. తమను చులకనగా చూస్తూ.. మళ్లీ అన్నిటికీ తమపైనే పూర్తిగా ఆధారపడుతున్న యూరప్ దేశాల తీరు  అగ్రరాజ్యానికి మింగుడు పడటం లేదు. 

గతంలో అంటే మొదటి,  రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో యూరప్‌ను రక్షించడానికి అమెరికా తన సైనికుల రక్తాన్ని ధారబోసింది. యుద్ధం తర్వాత మార్షల్ ప్లాన్ వంటి పథకాల ద్వారా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడమే కాకుండా, వాటి రక్షణకు  ద్వారా రక్షణ కవచాన్ని నిర్మించింది. 

అయితే.. ఆర్థిక, రక్షణ రంగాల్లో అమెరికాపై పూర్తిగా డిపెండెంట్ అయిన  యూరోపియన్ దేశాలు.. సామాజిక సంక్షేమ పథకాలకే ఎక్కువ వ్యయం చేస్తూ.. రక్షణ విషయంలో అది అమెరికా బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.  2006లో తమ జీడీపీలో కనీసం 2 శాతం రక్షణ రంగానికి కేటాయించాలని నాటో దేశాలు నిర్ణయించినప్పటికీ.. ఇప్పటికీ ఆ లక్ష్యాన్ని యూరోపియన్ దేశాలు చేరుకోలేదు.  అదే సమయంలో అమెరికా రక్షణ బాధ్యతను మోస్తుంటే, యూరప్ దేశాలు మాత్రం అమెరికా ప్రధాన శత్రువులైన రష్యా నుండి ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ, చైనా పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆర్థికంగా బలపడ్డాయి. ఈ ధోరణినే అగ్రరాజ్యం తప్పుపడుతోంది.  ఇదే   అట్లాంటిక్ కూటమి  బీటలు వారడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

గతంలో అంటే  2018లో నాటో వేదికగా ట్రంప్ చేసిన హెచ్చరికలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. రష్యా ఇంధనంపై ఆధారపడుతూ, మళ్ళీ రష్యా నుండే రక్షణ కల్పించమని అమెరికాను కోరడం హాస్యాస్పదమని అప్పట్లో ఆయన ఎద్దేవా చేశారు. ఆ సమయంలో ఆయన వ్యాఖ్యలను యూరప్ నేతలు కొట్టిపారేసినప్పటికీ,  2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ట్రంప్ మాటల్లోని వాస్తవం యూరప్ దేశాలకు అర్దమైనా అర్ధం కాకపోయినా.. ప్రపంచానికి మాత్రం అర్థమైంది. ఇటు వాణిజ్య పరంగా కూడా అమెరికాకు యూరప్ ద్వారా ఏటా వందల బిలియన్ల డాలర్ల లోటు ఏర్పడుతోంది.  అంటే ఒకవైపు ఆర్థికంగా అమెరికాను వాడుకుంటూ, మరోవైపు వ్యూహాత్మకంగా అమెరికా శత్రు దేశాలతో స్నేహం చేస్తూ యూరోప్ దేశాలు రెండిందాలా లాభపడటాన్ని  అమెరికా సమాజంలో తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది. 

భవిష్యత్తులో ఈ సంబంధాలు మెరుగుపడాలంటే కేవలం నాయకుల మార్పు సరిపోదు. యూరప్ తన రక్షణ బాధ్యతలను స్వీకరించడం, వాణిజ్య పరమైన అసమానతలను సరిదిద్దడం వంటి కీలక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కేవలం అమెరికానే అన్నిటికీ బాధ్యత వహించాలనే ధోరణిని వీడి, పరస్పర ప్రయోజనాల ఆధారంగా సంబంధాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాంటిక్ కూటమి మనుగడ సాగించాలంటే వ్యక్తులపై నెపం నెట్టడం కాకుండా.. వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడంపైనే దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో, ఈ అంతరాలు మరింత పెరిగి కూటమి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

By
en-us Political News

  
ఇటీవల ఒక భారతీయ మహిళా టెక్ ప్రొఫెషనల్, చికాగోలో 3లక్షల డాలర్ల గూగుల్ జాబ్ ( భారత కరెన్సీలో అక్షరాలా.. 2,78,23,500.00 రూపాయలు) వదిలి, దుబాయ్ కు షిఫ్ట్ అవ్వడం, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమెది కేవలం వ్యక్తిగత నిర్ణయంగా మాత్రమే చూడలేం. ఇది ఒక పెద్ద ట్రెండ్ కు ప్రతీకగా చెప్పుకోవచ్చు.
బ్యాంకాక్ నుంచి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు శంషాబాద్ చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆమె వెంట ఉన్న లగేజీ బ్యాగులలో రహస్యంగా దాచిన డ్రగ్స్ బయటపడ్డాయి.
శ్రీవాణి నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని గతంలోనే నిర్ణయించామనీ, ఈ ఆలయాల నిర్మాణ బాధ్యత జిల్లా యంత్రాంగానికి అప్పగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలోనూ పాతిక నుంచి 30 ఆలయాలను నిర్మించే అవకాశం ఉంటుందన్న ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయాల నిర్మాణాన్ని చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
థాయ్ లాండ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నీళ్లతో ఒకరినొకరు తడుపుకుంటూ పండుగ చేసుకుంటారు. కానీ ఈ ఏడాది ఈ ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాలలో 191 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యి మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మెగా ప్రాజెక్ట్ కోసం అనకాపల్లి జిల్లా రాంబిల్లి ప్రాంతంలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే యూనిట్ సుమారు 16 గిగావాట్ అవర్ ( సామర్థ్యంతో పనిచేయనుంది. ఈ ప్లాంట్‌లో కేవలం బ్యాటరీ ప్యాక్‌లు మాత్రమే కాకుండా, సెల్ తయారీ, ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌కు అవసరమైన విడిభాగాలను కూడా ఉత్పత్తి చేయనుంది.
అలా సింగపూర్ పర్యటనకు వెళ్లనున్న మంత్రుల బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో అమరావతి అభివృద్ధికి సింగపూర్ మోడల్ ఎలా ఉపయోగపడుతుందన్న పరిశీలన, అధ్యయనానికి సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్‌లతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు లెబనాన్‌లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల కాలం తర్వాత అమెరికా చొరవతో ఇరు దేశాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి చర్చలు జరపడం విశేషం.
నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో జూనియర్ ఉద్యోగినులపై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి యత్నాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిదా ఖాన్ పాత్ర అత్యంత కీలకమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిదా ఖాన్ వారిని బెదిరించి, నిందితులైన సీనియర్ అధికారులకు సహకరించారని ఆరోపణలున్నాయి.
పెళ్ళి పీటల మీద మురిసిపోయిన వధువు, మొదటి రాత్రే తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది.
విశాఖపట్నం నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో, స్నేహితులు తనపై దాడి చేశారన్న అవమానభారంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
లోక్‌సభలో తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.