సముద్ర జలాలపై అమెరికా పట్టు.. .. చైనాకు తప్పని తిప్పలు!

Publish Date:Apr 16, 2026

Advertisement

ప్రపంచ చమురు రవాణా మార్గాలపై పట్టు సాధించే క్రమంలో అమెరికా తన వ్యూహాలను వేగంగా మారుస్తోంది. ఇప్పటివరకు పశ్చిమ ఆసియాలోని హార్ముజ్ జలసంధిపై దృష్టి సారించిన అమెరికా  ఇప్పుడు తన ప్రాధాన్యతలను ఆగ్నేయ ఆసియాలోని మలక్కా జలసంధి వైపు మళ్లిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి వెన్నెముకగా నిలిచే ఈ జలసంధిపై పర్యవేక్షణ పెంచడం ద్వారా  చైనాకు అందే ఇంధన సరఫరాను నియంత్రించాలన్నది అమెరికా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇటీవల ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఈ వ్యూహాత్మక మార్పులో ఒక కీలక మైలురాయి. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభింస్తుంది. దీనివల్ల మలక్కా జలసంధి గుండా సాగే నౌకాయానాన్ని నిరంతరం పర్యవేక్షించే సామర్థ్యం అమెరికాకు పెరుగుతుంది.

ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల కదలికలపై ఆంక్షలు విధించి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా, ఇప్పుడు అదే తరహా ఒత్తిడిని చైనాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మలక్కా జలసంధి భౌగోళికంగా ఎంతో సంక్లిష్టమైనది. కొన్ని చోట్ల దీని వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40 శాతం,   సముద్ర మార్గంలో జరిగే చమురు రవాణాలో 30 శాతం ఈ ఇరుకైన మార్గం గుండానే సాగుతుంది. ముఖ్యంగా చైనా దిగుమతి చేసుకునే ముడి చమురులో 80 శాతం ఇక్కడి నుంచే వెళ్లాలి.  ఒకవేళ ఏదైనా కారణంతో ఈ మార్గం మూసుకుపోతే చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే డేంజర్ ఏర్పడుతుంది. అందుకే దీనిని బీజింగ్ వర్గాలు  మలక్కా డైలెమా అంటే మలక్కా చిక్కుముడి  అని పిలుస్తాయి.

ఈ సవాలును ఎదుర్కొనేందుకు చైనా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు ద్వారా భూమార్గాలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో ముడి చమురు, సహజ వాయువును రైల్వేల ద్వారా తరలించడం అసాధ్యం. మరోవైపు ఆంక్షలను తప్పించుకోవడానికి  షాడో ఫ్లీట్  అంటే గుర్తుతెలియని నౌకల సముదాయం సాయం తీసుకుంటున్నప్పటికీ, అమెరికా నిఘా ముందు అవి ఎంతవరకు నిలుస్తాయనేది ప్రశ్నార్థకమే. చైనా తన పట్టు నిలుపుకోవడానికి ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలతో దౌత్య సంబంధాలను బలపరుచుకోవాలని చూస్తోంది. ఈ భౌగోళిక రాజకీయ యుద్ధంలో భారతదేశం అత్యంత కీలకమైన స్థానంలో ఉంది.

మలక్కా జలసంధికి పశ్చిమ ద్వారంగా పిలిచే అండమాన్ - నికోబార్ దీవులు భారత్‌కు సహజసిద్ధమైన రక్షణ కవచాలు. పోర్ట్ బ్లెయిర్ నుంచి కేవలం 24 గంటల్లోనే మలక్కా జలసంధిని చేరుకునే వీలుండటం భారత్‌కు పెద్ద అడ్వాంటేజ్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా భారత్ ఈ ప్రాంతంలో తన సైనిక, వాణిజ్య ప్రభావాన్ని మరింత పెంచుకుంటోంది. ఇక పోతే.. ఈ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించడం అమెరికాకు అంత సులభం కాదు. ఈ మార్గం మెజారిటీ భాగం ఇండోనేషియా, మలేషియా సార్వభౌమత్వంలో ఉంది. తమ ప్రాదేశిక జలాల్లో అగ్రరాజ్యాల ఆధిపత్యాన్ని ఆ దేశాలు సులువుగా అంగీకరించవు. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్ అయిన సింగపూర్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దేశాల రాజకీయాలు, ప్రయోజనాలు ఈ సముద్ర వ్యూహ పోరును మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.

రానున్న కాలంలో ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. చైనా తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, అమెరికా విధిస్తున్న నియంత్రణల మధ్య సమతుల్యత దెబ్బతింటే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్ ఒక వైపు తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటూనే, మరోవైపు ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడే కీలక శక్తిగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది.

-సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
48 ఏళ్ల ఆసిఫ్ రజా వ్యాపారవేత్త ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి ఈ వినాశకర మిషన్‌ను ప్రారంభించాడు.
ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్‌కు చికిత్స అందిస్తోంది. ఆయనకు ప్రాథమికంగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
సాధారణంగా శబరిమల ఆలయ పరిసరాలను నో ఫ్లై జోన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఎటువంటి విమానాలు లేదా హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే, కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఎత్తులో పదేపదే చక్కర్లు కొట్టినట్లు భక్తులు, ఆలయ సిబ్బంది గుర్తించారు.
అమెరికా ప్రతినిధుల బృందంలో ట్రంప్ సన్నిహితుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉన్నారు. వీరిద్దరూ ఇస్లామాబాద్ చేరుకుని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ముఖాముఖి భేటీ అవుతారు. ఈ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించగా, మరోవైపు గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులను తిరగరాశాడు. అభిమానులకు కనువిందు చేసిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించారు.
సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వడంతో, శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను గుజరాత్ నుంచి లాగేసుకున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.