స్కూట‌ర్‌పై డెడ్‌బాడీ.. అంబులెన్సు దందాతో దారుణం.. జ‌గ‌న‌న్న పోయే కాలం!

Publish Date:Apr 26, 2022

Advertisement

అంబులెన్స్ యూనియన్ డిమాండ్ చేసినంత సొమ్ము ఇచ్చుకోలేని ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని సొంతూరికి స్కూటర్ మీద తీసుకెళ్లిన హృదయవిదారక ఘటన మంగళవారం తిరుపతిలోని ప్రతిష్టాత్మక రుయా ఆసుపత్రి వద్ద జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా అరాచకత్వం తాండవిస్తోంది. అడిగేవారు లేరన్న ధీమాతో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సామాన్యులకు నరకం చూపిస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనిపించేలా పరిస్థితి తయారైంది. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ ను మించిపోయాయా అన్న అనుమానం కలుగుతోంది. భూ మాఫియా, డ్రగ్ మాఫియాలా ఇప్పుడు రుయా ఆసుపత్రి వద్ద అంబులెన్స్ మాఫియా నడుస్తోంది. ఇక్కడ అంబులెన్స్ యూనియన్లదే హవా. వారు చెప్పిందే వేదం. వారి మాటే శిలా శాసనం. 
అంబులెన్స మాఫియా అమానుషత్వానికీ, అరాచకత్వానికి నిదర్శనంగా మంగళవారం రుయా ఆసుపత్రి వద్ద చోటు చేసుకున్న సంఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచిపోతుంది.
 రుయా ఆస్పత్రి వద్ద ప్రభుత్వ డ్రైవర్లు, మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు ప్రైవేటు అంబులెన్స్ యజమానుల కుమ్మక్కు దందా కారణంగా ఈ ఆసుపత్రి వద్ద అయిన వారి మృతదేహాలను తరలించడమన్నది సామాన్యులకు అందుబాటులో లేనంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. 

కడప జిల్లా చిద్వేలుకుకు చెందిన ఓ వ్యక్తి కుమారుడు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. ఆ బాలుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు తండ్రి బయట నుంచి ఓ అంబులెన్స్  మాట్లాడుకుని తెచ్చుకున్నారు. అయితే ఆసుపత్రి వద్ద నడుస్తున్న అంబులెన్స్ మాఫియా అందుకు అంగీకరించలేదు. బయటి వాహనంలో మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించేదే లేదంటూ అడ్డుకున్నారు. తామడిగినంతా చెల్లించి తాము చెప్పిన అంబులెన్స్ లోనే మృతదేహాన్ని తరలించాలని భీష్మించారు. దీంతో ఆ తండ్రి గత్యంతరం లేక, వారిడిగినంత ఇచ్చుకోలేక, కుమారుడి మృత దేహాన్ని తన స్కూటర్ పైనే సొంతూరికి తీసుకు వెళ్లాడు. 
ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా పలువురు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన ప్రభుత్వ వైఫల్యమేనని నారా చంద్రబాబు అన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో ఆరోగ్య రక్షణ వ్యవస్థ ఎంత అధోగతిలో ఉందో స్పష్టం చేస్తున్నదని చెప్పారు.  ఇక లోకేష్ అయితే... రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ మండి పడ్డారు. ప్రభుత్వాసుపత్రులు అరాచకాలకు నిలయాలుగా మారిపోయాయని విమర్శించారు. విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో యువతిపై సామూహిక అత్యచారం ఘటన మరవక ముందే తిరుపతిలోని ప్రభుత్వాసుపత్రి వద్ద అంబులెన్స్ దందా ఏమిటీ పరిస్థితి.. అసలీ రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ మండిపడ్డారు. అసమర్ధ పాలకుడి చేతిలో రాష్ట్రం అరాచకాలకు నిలయంగా మారిపోయిందని విమర్శించారు. 

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.