బోడుప్పల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ ) అధినేత్రి కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారు లను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
"మేము కొత్త డిమాండ్లు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరాం. ఉద్యమకారులకు ఇస్తామని చెప్పిన 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే రక్తం కళ్ల చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమకారులు హామీలు అమలు చేయాలని అడిగినందుకే లాఠీఛార్జ్ చేసి రక్తం చిందేలా కొట్టడం అన్యాయమన్న కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. "కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ్టి నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రతి రోజూ ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tension-in--boduppal-land-struggle-25-224859.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.