మరోసారి బెయిల్ కోసం శ్రీలక్ష్మి యత్నాలు
Publish Date:Mar 15, 2012
Advertisement
హైదరాబాద్ : అక్రమమైనింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి బెయిల్ కోసం గురువారం నాంపల్లి కోర్టులో మరోసారి పిటీషన్ దాఖలు చేశారు. గతంలో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీం కోర్టు చేసిన సూచనల మేరకు ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేసి మూడు మాసాలు అయిందని ఆమె పిటీషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ ఛార్జిషీట్‌లో తన పేరు లేదని ఆమె తెలిపారు. తనపై ప్రాజిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆమె చెప్పారు. కేసుకు సంబంధించి ఇప్పటికే తన నుండి అవసరమైన సమాచారాన్ని సిబిఐ అధికారులు తీసుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే కేసుపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. శ్రీలక్ష్మిని అరెస్టు చేసి అరవై రోజులు అయినప్పటికీ ఛార్జీషీట్ దాఖలు చేయనందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
http://www.teluguone.com/news/content/again-24-12666.html





