చిట్టీల వ్యాపారి 5 కోట్లకు కుచ్చుటోపీ..14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు..!

Publish Date:Aug 28, 2026

Advertisement

 

చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కం 10వ అదనపు మెట్రోపా లిటన్ మేజిస్ట్రేట్ ఎదుట నిందితుడిని హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిం చారు. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి కేంద్ర కారాగా రానికి తరలిం చారు. పోలీసులు హౌసింగ్ బోర్డుకు చెందిన నల్ల రమేష్ (62) ఆర్యవైశ్య సంఘం కార్యదర్శిగా పనిచేస్తూ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 

ఈ క్రమంలో సాకేత్‌కు చెందిన ఏ. వెంకటేశ్వర్లు నల్ల రమేష్ వద్ద రూ.10 లక్షల చిట్టీ వేశారు. సుమారు 25 నెలల పాటు క్రమం తప్ప కుండా చిట్టీ డబ్బులు చెల్లించారు. చిట్టీ గడువు పూర్తయిన తర్వాత వెంకటేశ్వర్లుకు రావాల్సిన రూ.20 లక్షలకు సంబం ధించి రమేష్ చెక్కు ఇచ్చాడు.అయితే ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా బౌన్స్ కావడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. డబ్బులు తిరిగి చెల్లించాలని పలు మార్లు కోరినా నల్ల రమేష్ నుంచి స్పందన లేకపోవ డంతో, నెలలు గడిచినా తనకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవ డంతో వెంకటేశ్వర్లు గత జూలై 7న జవహర్‌నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నల్ల రమేష్ వద్ద చిట్టీలు వేసిన మరికొందరు కూడా డబ్బులు కోల్పోయినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. బాధితుల సంఖ్య సుమారు 25 మందికి చేరడంతో పాటు, మొత్తం వ్యవహారం దాదాపు రూ.5 కోట్ల మేరకు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.దర్యాప్తులో భాగంగా నల్ల రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 27న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ప్రస్తుతం రమేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నిందితుడిపై మరిన్ని ఫిర్యాదులు, కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
 

By
en-us Political News

  
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఓ బహిరంగ సభలో కేటీఆర్ కేసీఆర్ తప్పు చేశారంటూ చేసిన  వ్యాఖ్యను ఎత్తి చూపుతూ బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కేటీఆర్ ఆ సభలో ఏమన్నారంటే.. కేసీఆర్ గతంలో సొంత నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేలకే అధికారాలు కట్టబెట్టి తప్పు చేశారని వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చర్యలు తీసుకుని, అనుమతులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను
JNTU కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలో జరిగిన సంచలనాత్మక ఆర్మీ ఆయుధాల చోరీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.