Publish Date:Jun 13, 2026
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ 80వ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించడానికి వైట్ హౌస్‌లో భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ చరిత్రలోనే తొలిసారిగా అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ) కేజ్ ఫైట్ నిర్వహించనున్నారు. ఆదివారం (జులై 14) ట్రంప్ జన్మదినం సందర్భంగా నిర్వహించే ఈ ఈవెంట్‌కు 60 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు 500 కోట్ల రూపాయలు చేయనున్నారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం (జులై 4) పురస్కరించుకుని ఈ ఈవెంట్‌కు యూఎఫ్సీ ఫ్రీడమ్ 250 అని పేరు పెట్టారు.
ట్రంప్ సన్నిహితుడు యూఎఫ్‌సీ సీఈఓ డానా వైట్ ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగనుంది . బోన్లలో నిర్వహించే ఈ పోటీలంటే ట్రంప్‌కు ఎంతో ఇష్టం. గతంలో చాలాసార్లు ఆయన ఆ పోటీలను వీక్షించారు. ఈ పోటీలో పలు దేశాలకు చెందిన ప్రముఖ ఫైటర్లు తలపడనున్నారు. యూఎఫ్‌సీ ఫ్రీడమ్ 250 కోంస వైట్ హైస్ ప్రాంగణంలో ది క్లా పేరుతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. 92 అడుగుల ఎత్తు, 154 అడుగుల వెడల్పు, 600 టన్నుల మెటల్‌తో భారీ స్థాయిలో తాత్కాలిక పైకప్పు నిర్మించారు. వేదిక మధ్యలో యూఎఫ్‌సీ ఫైటింగ్ కేజ్‌తో పాటు, నలుగే వేల మంది కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. సామాన్యలు వీక్షించేందుకు వైట్‌హౌస్ బయట భారీ స్క్రీన్‌లు పెట్టారు. అయితే ఈఫిల్ టవర్‌లా ఆ తాత్కాలిక నిర్మాణం శాశ్వతం ఉండిపోతుందని ట్రంప్ అంటున్నారు.
ట్రంప్ పుట్టిన రోజు పేరుతో వైట్ హౌస్‌లో యూఎఫ్‌సీ పోటీల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు క్రీడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే అందులో జోక్యం చేసుకోవడానికి స్థానిక డిస్ట్రిక్ కోర్టు నిరాకరించింది. మరోవైపు ఈ కార్యక్రమాన్ని సమర్ధించుకుంటున్న వైట్‌హౌస్ వర్గాలు, నిర్వహణ ఖర్చంతా యూఎఫ్‌సీనే భరిస్తోందని చెప్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/500-crore-cage-fight-36-222877.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే