Publish Date:Jun 13, 2026
కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్ గ్రామానికి చెందిన నవనీత అనే వివాహిత తన భర్త, ఏడేళ్ల కుమారుడు విగ్నేష్, ఐదేళ్ల కుమార్తె మధుప్రియలతో నివాసం ఉంటుంది. అయితే.. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో విసుగు చెందిన నవనీత ముందుగా ఇద్దరు పిల్లలకు ఉరివేసి హత్య చేసి.. అనంతరం తాను కూడా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది.
నవనీత ఆత్మహత్య చేసుకోబోయే ముందు తన ఆత్మహత్య కు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ లో రాసింది. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడులే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తు న్నారు. . మృతదేహాలను పోస్టుమా ర్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను విచారిస్తూ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఒకే ఇంట్లో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతిచెందడం తో అడవి వెంకటాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mother-kills-two-children-and-sucide-36-222878.html
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.