పీఎల్జీఏ కమాండర్ సోది కేశాలు సహా 42 మంది మావోలు లొంగుబాటు

Publish Date:Apr 10, 2026

Advertisement

మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి దెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అడవిని నమ్ముకుని సాయుధ పోరాటం చేస్తున్న 42 మంది మావోయిస్టులు శుక్రవారం (ఏప్రిల్ 10) తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీరిలో అత్యంత కీలకమైన తెలంగాణ స్టేట్ కమిటీ (టీఎస్సీ) నేతలతో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ బెటాలియన్ సభ్యులు కూడా ఉన్నారు.

లొంగిపోయిన వారిలో ప్రధానంగా పీఎల్జీఏ బెటాలియన్ ఇన్-చార్జ్ కమాండర్ సోది  కేశాలు, , తెలంగాణ స్టేట్ కమిటీ మిలిటరీ చీఫ్ చప నారాయణ అలియాస్ మధు, డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు  వంటి అగ్రశ్రేణి నాయకులు ఉన్నారు. వీరితో పాటు మొత్తం 42 మంది క్యాడర్ బయటకు రావడంతో తెలంగాణలో మావోయిస్టు సంస్థాగత నిర్మాణం దాదాపుగా కుప్పకూలిందని పోలీసు వర్గాలు ప్రకటించాయి.

ఈ సందర్భంగా మావోయిస్టులు భారీగా ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.  వీటిలో 5 ఏకే-47లు, ఎస్ఎల్ఆర్‌లు, ఇన్సాస్ రైఫిల్స్, స్టెన్ గన్‌లతో పాటు మొత్తం 36 రకాల ఆయుధాలు, వెయ్యికి పైగా తూటాలు ఉన్నాయి. అంతేకాకుండా, పార్టీ నిధులకు సంబంధించిన  800 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులకు అంద చేశారు. ఈ పరిణామంతో తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని, ఇకపై రాష్ట్రంలో వారి ఉనికి నామమాత్రమేనని అధికారులు భావిస్తున్నారు. 

ప్రభుత్వ పునరావాస పథకంలో భాగంగా లొంగిపోయిన వారందరికీ తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. మొత్తం రూ.1.93 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయగా, ప్రాథమికంగా ఒక్కొక్కరికి  25 వేల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. లొంగిపోయిన మావోయిస్టులందరికీ మెరుగైన వైద్యం కోసం హెల్త్ కార్డులు అందజేస్తామని ఈ సందర్భంగా డీజీపీ చెప్పారు.  

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, టెక్నాలజీ ప్రభావం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎలా చేరుతోందో చూపించే ఆసక్తికర ఉదాహరణ ఇది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో ఓ రైతు పొలం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం—ప్రాణ భద్రత.
77 ఏళ్ల గణపతి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అంటే డయాబెటిస్, కీళ్లనొప్పులు, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ ఆయనను అడవుల నుంచి బయటకు పంపిందని సమాచారం.
అమెరికా విధించిన రెడ్ లైన్స్ వెనుక బలమైన కారణం ఉందన్న జేడీ వాన్స్, ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే, అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచ శాంతికే ముప్పన్నారు.
హైదరాబాద్ వాతావరఖ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. . రానున్న పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నైతొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు.
నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (ఈ3) కార్యక్రమం చేపడతామన్నారు.
బీహార్‌కు చెందిన యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. 2025-26 సంవత్సరాల్లో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, నెటిజన్లు సూర్యవంశీ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అందులో మొదటిది- వైభవ్.. వయసు, పుట్టిన తేదీ వివరాలు. ఇది నెటిజన్లు వేసిన టాప్ క్వశ్చిన్ గా నిలుస్తోంది. కేవలం 13-14 ఏళ్లకే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆడటం వల్ల వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ అనే పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపి, ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణల్లో నిజ‌ముందని తేల్చింది. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 146 మంది ఎంపీలు లోక్‌సభలో సంతకాలు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని కూడా నియమించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.