తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
బుధవారం (జూన్ 7) తిరుమల శ్రీవారిని 75వేల 229 మంది భక్తుల దర్శించుకున్నారు. 35వేల 618 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక గురువారం (జూన్8) ఉదయం నుంచీ 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/24-houra-for-srivari-sarva-darshnam-39-156496.html
కాంగ్రెస్ పార్టీలో కట్టప్పల జాబితా ఎక్కువే ఉంటుంది.. ఇప్పుడనే కాదు.. గతంలోనూ ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. కాంగ్రెస్ లో ఉంటూనే.. పార్టీలో సీనియర్ నేతలమనే ట్యాగ్ తగిలించుకొని ఇతర పార్టీలకు సహాయ సహకారాలు అందించడం వారికి అలవాటుగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత కొందరు సీనియర్ నేతలు కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు.
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తోడు దసరా సెలవులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఉండటంతో తిరుమలలో రద్దీ విపరీతంగా పెరిగింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి వచ్చిన నేషనల్ అవార్డు రద్దయింది.
ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ల నారాయణ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉంది. ఆమెపై చర్యలకు సిద్ధమౌతోంది. నటి సమంతపై ఆమె చేసిన వ్యాఖ్యల వేడి హస్తినను తాకింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమంతపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖను ఆదేశించారు. రాజకీయ విమర్శలలో మహిళలను ఎలా లాగుతారని రాహుల్ గాంధీ కొండా సురేఖను నిలదీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తాను చంపిన రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, కలలోకి వచ్చి భయపెడుతోందని, అందువల్ల భయంతో తనకు నిద్ర పట్టడం లేదని దర్శన్ జైలు అధికారులకు చెబుతున్నారని తెలుస్తోంది.
టి20 మహిళల వరల్డ్ కప్‌లో భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తమిళనాడులో కేసు నమోదైంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
వైసీపీ అధినేత జగన్ ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం నుంచి నేర్చుకున్న పాఠం ఏదైనా ఉందంటే అది మీడియా విలువ తెలుసుకోవడం ఒక్కటే. ఒక్క మీడయా విషయంలోనే ఆయన అహాన్ని తగ్గించుకున్నారు. మీడియాకు దాసోహం అంటున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రెస్ మీటంటే మొహం చాటేసిన జగన్ ఇప్పుడు ప్రెస్ మీట్ ల ద్వారా మాత్రమే తన మొహం జనాలకు కనిపిస్తుందని అర్ధం చేసుకున్నారు.
ఏపీ సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది