పేద-మధ్య తరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు : సీఎం చంద్రబాబు

Publish Date:Jun 18, 2026

Advertisement

 

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 18వ ఎస్ఐపీబీ సమావేశంలో రూ.30,515 కోట్ల పెట్టుబడులతో 50 కంపెనీలకు ఆమోదం లభించగా, వీటి ద్వారా 29,677 ఉద్యోగాలు సృష్టించనున్నట్లు తెలిపారు.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా కోర్సుల రూపకల్పన, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక కోర్సులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇథనాల్, బయోఫ్యూయల్స్, సెమీ కండక్టర్లు, డేటా సెంటర్లు, బ్యాటరీ టెక్నాలజీ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

రైతులకు ఉపయోగపడేలా మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పార్క్ ఏర్పాటు చేయాలని, తక్కువ ధరల్లో పరికరాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఏఐ ఆధారిత టెక్నాలజీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

పారిశ్రామిక ప్రాంతాల వద్ద అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు చేపట్టాలని, పర్యాటక రంగంలో హోటళ్లు, రిసార్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రాజెక్టులు గ్రౌండింగ్ దశకు చేరిన తర్వాతే ప్రోత్సాహకాలు, రాయితీలు అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.

By
en-us Political News

  
బాపూ సరోవర్ నిర్మాణానికి అవసరమైన అత్యంత కీలకమైన రక్షణశాఖ భూముల బదలాయింపునకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ అధికారికంగా అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం (జూన్ 19) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 550 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టతలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలే లక్ష్యం...కొత్త వ్యూహాలతో జనసేన ముందడుగు!
సాయికృష్ణ కేసులో దోషులపై కఠిన చర్యలు..
లింగంగుంట్ల నుంచి నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
హైదరాబాద్ శివార్లలోని గండిపేట పరిధిలో వెలుగుచూసిన సంచలనాత్మక నకిలీ జీఓల భూ కబ్జా కేసు
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది
గుజరాత్‌లో డెయిరీ క్వీన్ గా ఎదిగిన మహిళా ప్రస్థానం..
మసూరీ టూర్‌లో వైజాగ్ మహిళా టెక్కీ అనుమానాస్పద మృతి.. భర్తపైనే తల్లిదండ్రుల అనుమానాలు!
పాఠశాల వార్షికోత్సవంలో పాక్ దేశభక్తి గీతం..
హైదరాబాద్ నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక నీట్ (NEET) పరీక్ష వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే
చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లతో ధర్మశాల, న్యూజిలాండ్ మైదానాలను తలపిస్తున్న కడప క్రికెట్ స్టేడియం అందాలు
లీప్‌ఫ్రాగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఐపీఓ (Leapfrog Engineering SME IPO) నేటితో ముగియనుంది. తాజా సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP), లాట్ సైజ్ మరియు కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.