ఇన్ స్టా గ్రామ్ వేధింపులు.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
Publish Date:Apr 10, 2026
Advertisement
ఇన్ స్టా గ్రామ్ వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హాయత్ నగర్ పరిధిలో జరిగింది. సినీమాలు, సోషల్ మీడియా ప్రభావం యువతను తప్పుదోవ పట్టిస్తు న్నదనడానికి తార్కానంగా ఈ సంఘటనను చెప్పుకోవచ్చు. హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరు ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికల మధ్య పరిచయం ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్ వరకూ వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఆ బాలుడు బాలికను ఇన్ స్టాగ్రామ్ లో వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులు భరించలేక ఆ బాలిక పలు మార్లు ఆ బాలుడిని మందలించింది. అయినా ఫలితం లేకపోగా, ఇటీవలి కాలంలో ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆ వేధింపులకు తాళలేక టెన్త్ చదువుతున్న ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాదుకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
http://www.teluguone.com/news/content/10th-class-student-commits-suicide-36-217081.html





