రాష్ట్ర సంక్షోభాలకు కేంద్రమే కారణమా?
Publish Date:Aug 22, 2012
Advertisement
వాన్‌పిక్ వ్యవహారంలో సిబిఐ చార్జ్‌షీట్ పెట్టిందని నైతిక భాద్యత వహిస్తూ రాజీనామా చేసిన ధర్మాన ప్రస్తుతానికి మిగాతా మంత్రుల పరామర్శలతో ఇంటి దగ్గరే ఉన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఫైల్ ఇంకా నాదగ్గరకు రాలేదంటూ వస్తే చట్ట బద్దంగా వ్యవహారిస్తానని చెప్పారు. ఇంకా కిరణ్‌కుమార్‌రెడ్డి తనకు ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామాను పంపలేదనే సంకేతం పంపారు. ఇప్పుడు దీనిపై నిర్ణయం తీసుకోవలసింది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ పైనే ఉంది. అయితే మంత్రులు మాత్రం రాజీనామాను అంగీకరించవద్దనే ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో కిల్లి కృపారాణి మరికొంత మంది, అధిష్టానాన్ని కలసి చెప్పటానికి ప్రయత్నిస్తే పట్టించుకునే వారే కరువయ్యారు. వాయిలార్ రవి రాజకీయాలలో ఏదైనా జరుగుతుందంటూ తప్పించుకున్నారు. పిసిసి అధ్యక్షుడిగా బొత్స ఢల్లీి వెళ్లి పరిస్థితులు వివరించి నిర్ణయాన్ని అధిష్టానికే వదిలి వేయాలని బొత్సనిర్ణయించుకున్నారు. అంటే ధర్మాన రాజీనామా అమోదించటం కిరణ్‌కు తప్పేటట్లు లేదు. అయితే ఆమోదించవద్దంటూ మంత్రుల ఒత్తిడితో అడకత్తెరలో పోకచెక్కలా అధిష్టానానికి, మంత్రులకూ మద్యనలిగిపోతున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్ధితులకు కేంద్రప్రభుత్వమే కారణమంటున్న మంత్రుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. రాష్ట్ర రాజకీయాలు పరిస్థితులపై కేంద్రం దృష్టి పెడటం లేదని రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని మంత్రులు వాపోతున్నట్లు తెలుస్తుంది. ఏదిఏమైనా రాష్ట్రరాజకీయాలకు ఉపద్రవం ముంచుకొచ్చినట్లే అని రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/-రాష్ట్ర-సంక్షోభాలకు-కేంద్రమే-కారణమా-24-16721.html





