తలాసానీ నీవు పార్టీలో ఉన్నట్లా లేనట్లా?

Publish Date:Jul 7, 2012

Advertisement

పార్టీకార్యకర్తలకు కౌ౦న్సిలింగ్‌లు ఇస్తూ రానున్న రోజుల్లో మనదే హవా అంటూ తనని తాను ఓదార్చుకొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపే పనిలో పడ్డారు చంద్రబాబునాయుడు. హైదరాబాద్‌లో జరిగే మహంకాళీ అమ్మవారి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులతోపాటు టిడిపి నాయకుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ టిడిపి అధినేత చంద్రబాబుని ఆహ్వానించాడానికి ఆయన నివాసానికి వెళ్లారు. అంతే చంద్రబాబుకి తలసాని శ్రీనివాసయాదవ్‌ అడ్డంగా దొరికిపోయారనే చెప్పవచ్చు.


 

ఏమండీ సీనియర్‌ అయ్యుండి మీరు ఇలా చేస్తే ఎలా పార్టీ మారిపోతున్నారంటూ వార్తలు వస్తే కనీసం ఖండి౦చడంలేదు. అసలే పార్టీ కష్టకాలంలో ఉంది, మీరు పార్టీకార్యక్రమాలకు కూడా గత నాలుగునెలలుగా రావడంలేదు, ఇంతకీ పార్టీలో ఉన్నట్లా లేనట్లా అంటూ తలసానిని కడిగిపారేశారు. నగరంలో కరెంటు సమస్యపై విద్యుత్‌సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా కు గాని, రైతుల సమస్యలపై ఇందిరాపార్కు దగ్గరకూ రాలేదని బాబు ఆక్రోషం వెళ్లగక్కారు. ఎన్టీఆర్‌ వర్దంతి ఇలా ప్రతిదానికి గైరుహాజరవటంపై తలసానిని  బాబు ప్రశ్నించారు. పార్టీలోఉంటూనే పార్టీ పరువు తీస్తున్నారని కూడా అన్నారు. ఇవన్నీ అమ్మవారి జాతరకు వచ్చిన ఆలయ కమిటీ మెంబర్లను బయటికి పంపి మరీ క్లాసు పీకినట్లు తెలిసింది. దానికి గాను తలసాని  పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, పార్టీనిర్ణయాల్లో  ఏమాత్రం సమాచారం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

 



చంద్రబాబునాయుడుతో చర్చల అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ వ్యవహారంగా అనునయించుకొన్నారు. అయితే ఈ వ్యవహారంపై సీనయర్‌ తెలుగుదేశం నాయకుడు మాట్లాడుతూ తలసాని బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు నడుపుతున్నారని, ఏపార్టీలోనూ స్ధానం లేకనే మళ్లీ బాబువద్దకు చేరారన్నారు. పార్టీ పోలిట్‌బ్యూరోలో స్ధానంకోసమే తలసాని ఇలాంటి ట్రిక్కులు ప్లేచేస్తున్నారని హైదరాబాద్‌ టిడిపి పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు ఆరోపించారు.

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.