రాష్ట్ర విద్యుత్‌ కోతలకు గుజరాత్‌ గ్యాస్‌కంపెనీలే కారణమా?

Publish Date:Jul 10, 2012

Advertisement

ప్రభుత్వాలన్నీ చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటాయేమో అని అనుకోవాలి. అసలు కాకినాడలో గ్యాస్‌ప్లాంటు కట్టి గుజరాత్‌కు గ్యాస్‌ సరఫరా చేస్తున్న జిఎస్‌పిసి(గుజరాత్‌స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషను), రిలయన్స్‌ల గురించి గతంలో ఎన్నో ఆందోళనలు జరిగాయి. పీఆర్పీ కూడా గతంలో ప్రధానంగా ఈ విషయమై ఆందోళన చేసింది. ఆంథ్రప్రదేశ్‌లో వెలికితీసిన గ్యాస్‌ను గుజరాత్‌కు 62శాతం తరలిస్తుంటే ముందు ఎందుకు మౌనం వహించారు? అన్న మిలియన్‌డాలర్ల ప్రశ్నకు రాష్ట్రపాలకులు మౌనమే సమాధానం అవుతోంది. అసలు ఈ ఉత్పత్తికి వెనుక జరిగిన వాస్తవాలు ఆంథ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంధత్వపాలనకు నిదర్శనమని విమర్శలు చెలరేగుతున్నాయి.

 

 

మొదట తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జిఎస్‌పిసి నిర్మాణం ఒప్పందం జరిగింది. దీని కార్యకలాపాలు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. దీనికి జతగా రిలయన్స్‌ కూడా తోడైంది. ఈ సంస్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైంది. సాక్షాత్తూ రిలయన్స్‌ అధినేత ముఖేష్‌అంబానీ కాకినాడ వస్తే  సిఎం  వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కేంద్ర పెట్రోలియం బృందం కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడారే కానీ, ఆంథ్రాకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేదు. ఈ విషయాన్ని గుర్తించిన పీఆర్పీ నేతలు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్యాస్‌ప్లాంటు ఇక్కడ పెట్టి కేవలం 38శాతం వాటాగా ఇస్తామనటం అన్యాయమని అప్పట్లోనే నిరసనకారులు స్పష్టం చేశారు. ఆ సంస్థలు 70 నుంచి 80శాతం గ్యాస్‌ రాష్ట్రంలోనే సరఫరా చేస్తే  విద్యుత్తు కొరతే ఉండేది కాదని తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అంగీకరించారు. అప్పట్లోనే నిరసనకార్యక్రమాలకు స్పందనగానైనా ఆ కంపెనీలను రాష్ట్రప్రభుత్వం పిలిపించి మాట్లాడి ఉంటే ఇప్పుడు సమస్యే వచ్చేది కాదనేది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఒకసారి ఆంథ్రలో గ్యాస్‌ సరఫరా పెంచమంటే సరిపోయేది. ఒక్కసారి కూడా ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడకపోవటం వల్ల ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంథ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అలుసుగా తీసుకునే ఇటువంటి కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

 


రాష్ట్రంలో విద్యుత్తు కోతకు అసలు కారణం గ్యాస్‌ ఉత్పత్తి చాలకపోవటమే. కాకినాడ నుంచి తరలిపోతున్న గ్యాస్‌లో 70శాతం కొన్నాళ్లపాటు విద్యుత్తు సరఫరాకు కేటాయిస్తే కొత్తప్లాంటులు ఏర్పాటు చేసుకునేంత వరకూ కోత విధించాల్సిన అవసరమే ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 9,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అయితే గ్యాస్‌ద్వారా మాత్రం 2700మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. గ్యాస్‌కొరత ఇంకో 1500మెగావాట్ల విద్యుత్తును దెబ్బతీస్తోంది. కేంద్రమంత్రి శరద్‌పవార్‌ను  సహకరించాలని సిఎం కోరారు. దీనికి స్పందించిన మంత్రి పవార్‌ మాట్లాడుతూ పెట్రోలియం కంపెనీల వ్యవహారాలు పర్యవేక్షించే కమిటీలో తాను, ప్రణబ్‌ముఖర్జీ మాత్రమే సభ్యులమన్నారు. రాష్ట్రపతి రేసులో ఉన్న ప్రణబ్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయటంతో తాను ఒక్కడినే ఆ కమిటీలో మిగిలానని, తాను ఆంథ్రప్రదేశ్‌ కోసం వీలైనంత వరకూ ఈ సమస్యను పరిష్కరించేందుకు పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
 

By
en-us Political News

  
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.