"ఒకే ఒక్కడు" సినిమాను గుర్తుచేసిన మమతా బెనర్జీ

Publish Date:May 25, 2012

Advertisement

మమత అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా, ఒక నియంతలా వ్యవహరిస్తున్నట్టు సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ఇటీవల సిఎన్ ఎన్ - ఐబిఎన్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన పత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం నుంచి మమత బెనర్జీ అర్ధంతరంగా వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్ డిటివి రిపోర్టర్ అడుగుతున్న ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పకపోగా మీరు (విలేకరులు) కమ్యూనిస్టు అభిమానులంటూ రుసరుసలాడుతూ స్టూడియో నుంచి బయటకు వచ్చి ముఖం చాటేశారు. మమత రావడం విలేకరులను దూషించడం వంటి దృశ్యాలను చూసిన వారికి "ఒకే ఒక్కడు" సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో వున్న రఘువరన్ ఒక టెలివిజన్ ఛానల్ విలేకరి (హీరో అర్జున్) ఇంటర్వ్యూ చేస్తుండగా మధ్యలో లేచి వెళ్లిపోయే సీన్ గుర్తుకు వచ్చింది. తనకు వ్యతిరేకంగా ప్రశ్నించిన వారిని కమ్యూనిస్టులనే ముద్రవేస్తూ వారిపై విరుచుకుపడడం మినహా సమాధానం చెప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలు కూడా శ్రుతిమించుతున్నాయి. జోద్ పూర్ యూనివర్శిటీకి చెందిన అంభికేష్ మహాపాత్రో అనే ఫ్రొఫెసర్ ఒక కార్టునిస్టు కూడా. ఇటీవల ఆయన ఒక కార్టూన్ వేశారు. ఆ కార్టూన్ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వుందనే నెపంతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఒక యువతిపై అత్యాచారం చేసిన కేసులో తృణమూల్ కార్యకర్తల పోలీసులు అరెస్టు చేస్తే ఆమె స్వయంగా పోలీసులకు చెప్పి వారిని విడిపించారు. పత్రికల్లో వచ్చిన వార్తలు వాస్తవాలే అయినా అవి తనకుగాని, తనపార్టీ కార్యకర్తలకు గాని వ్యతిరేకంగా వుంటే ఆ వార్తలు రాసిన పత్రికలపై కక్షసాధింపు దోరణి అవలంభిస్తోంది.

By
en-us Political News

  
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.