దేశంలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ సంక్షోభం

Publish Date:Apr 15, 2026

Advertisement

భారతదేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఇది ప్రధానంగా మద్యం సేవనంతో సంబంధం ఉన్న వ్యాధిగా భావించబడేది. కానీ ఇప్పుడు మెటబాలిక్ కారణాలు అంటే  అధిక బరువు, అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం ప్రధాన కారకాలు అవుతున్నాయి.

1990 నుంచి 2023 వరకు దేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి విస్తరణలో   23%  పెరుగుదల ఉంది.  అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు 23% కంటే ఎక్కువగా పెరిగాయి. నగర ప్రాంతాల్లో  ఇది 9 నుంచి 32 శాతం పెరుగుదల ఉండగా,  రాష్ట్రాల్లో  అయితే ఏకంగా  60శాతం వరకూ చేరినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

 ఫ్యాటీ లివర్ ఎందుకు ప్రమాదకరం?

 ఇది ఎటువంటి లక్షణాలు లేకుండా పెరుగుతుంది.  ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే చాలా మంది తమకు లివర్ సమస్య ఉందని తెలియకుండానే జీవిస్తున్నారు.  కాగా ఈ ఫ్యాటీ లివర్ వ్యాధి అన్నది యువతలో వేగంగా పెరుగుతోంది. ఇది ఇకపై మధ్య వయసు వారికే కాదు. పాతిక నుంచి 35  ఏళ్ల వయస్సు గల యువతలో కనిపిస్తున్నది.

 మెటబాలిక్ కారణాలు ప్రధాన పాత్ర

- అధిక చక్కెర
- అధిక బరువు
- అధికంగా కూర్చునే పని చేసే జీవనశైలి
- ప్రాసెస్డ్ ఫుడ్
- ఫాస్ట్ ఫుడ్
- నిద్రలేమి
 కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణాలు.
 ఒక్క ఇండియా అనే కాదు.. లివర్ ఫ్యాట్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో కరికి ఫ్యాటీ లివర్ ఉంది. 1990తో పోలిస్తే ఇది 143శాతం పెరుగుదల.

  అయితే  చాలా వరకూ లివర్ వ్యాధులు నివారించవచ్చు 
- ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో పూర్తిగా నయం అవుతుంది
 జీవనశైలిని మార్చడం ద్వారా లివర్ మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది
 మందులు కంటే జీవనశైలి మార్పులు ఎక్కువ ప్రభావమంతం
 ఫ్యాటీ లివర్ నివారణ : వైద్యుల సూచనలు  
 ఆహారపు అలవాట్లు మార్చుకోవడం
- తెల్ల బియ్యం, తెల్ల రొట్టె, చక్కెర పానీయాలు, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్,     ప్యాకేజ్డ్ జ్యూస్ వంటివాటిని దూరంగా ఉంచడం, అలాగే.. అధిక నూనె, ఫ్రైడ్ ఫుడ్ వంటి వాటి జోలికి పోకుండా ఉండటం ద్వారా ఫ్యాటీ లివర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. 
 ఇకబ్రౌన్ రైస్, మిల్లెట్స్, పండ్లు, కూరగాయలు, పప్పులు, గుడ్లు, చేపలు వంటి ప్రొటీన్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, అలాగే, గ్రీన్ టీ, నిమ్మరసం, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. 

 అదే విధంగా రోజుకు కనీసం అరగంట ర్యాపిడ్ వాక్, యోగా, సైక్లింగ్,స్విమ్మింగ్, వ్యాయామం వంటి వాటిని చేయడం ద్వారా ఫ్యాటీ లివర్ కు దూరం కావచ్చు. కాలేయం ఆరోగ్యానికి ఇవన్నీ ఎంతో మంచివి. ఇక పోతే..  రువు తగ్గడం అత్యంత ముఖ్యమైనది. 5 నుంచి పది శాతం బరువు తగ్గినా కాలేయంలోని  కొవ్వు 50 శాతం వరకూ తగ్గుతుంది. మద్యపానానికి దూరంగా ఉండాలి. ఫ్యాటీ లివర్ ఉన్న వారికి మద్యపానం అత్యంత ప్రమాదకరం. 

  ఏడాదికి ఒక సారి లివర్ ఫంక్షన్ టెస్ట్, అబ్డామిన్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవాలి. అవసరం అయితే ఫైబ్రో స్కాన్ చేయించుకోవాలి.   సరిపడా నిద్ర అంతటే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర కాలేయ ఆరోగ్యానికి చాలా మంచింది.  అలాగే రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం లివర్ డిటాక్సిఫికేషన్ కు దోహదపడుతుంది.  
 
- పొట్ట భాగంలో అధిక కొవ్వు ఉన్నవారు
- డయాబెటిస్ ఉన్నవారు
- పీసీఓఎస్ ఉన్న మహిళలు
 - అధిక బరువు ఉన్నవారు
- రోజంతా కూర్చునే ఉద్యోగాలు చేసే వారు
- ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినేవారు
ఫాటీ లివర్ వ్యాధి బారిన పడే అవకాశలు ఎక్కువ ఉన్నవారిగా చెప్పవచ్చు. 
 చివరిగా చెప్పాలంటే..  ఫ్యాటీ లివర్ ఒక నిశ్శబ్ద మహమ్మారి.  అయితే ఇది పూర్తిగా నివారించగలిగిన  వ్యాధి.  ఆహారం, లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాలేయం ఆరోగ్యంగా ఉందంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లే.  

సంకలనం, సేకరణ: సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
వానకాలం ఖరీఫ్ సీజన్ సగం గడుస్తున్నప్పటికీ వర్షభావ పరిస్థితుల కారణంగా సాగు రంగం సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సారికి క్రాప్ హాలీడే యే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం కారణంగా ఈ సీజన్ సాగుకు తిలోదకాలు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
వైరస్  వ్యాప్తి వేగాన్ని అరికట్టుందుకు   ఆరోగ్య శాఖ సిబ్బంది  యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన వారితో నేరుగా సంబంధం కలిగి ఉన్న ప్రాథమిక కాంటాక్ట్‌లను  గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ మ్యాచ్‌కు భారత్ వేదిక కాబోతోందా? చెన్నైలో బిగ్ బాష్ లీగ్ ఓపెనింగ్ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ వెల్లడించిన క్రేజీ ప్లాన్స్, లాజిస్టికల్ సవాళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ దిగ్గజం బిఎన్‌పి పారిబాస్ కార్డిఫ్, వార్‌బర్గ్ పింకస్ నుండి ఇండియాఫస్ట్ లైఫ్‌లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. సుమారు ₹10,000 కోట్ల విలువైన ఈ బిగ్ ఇన్సూరెన్స్ డీల్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వాటా వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఓపెన్ ఏఐ రక్షణ సరిహద్దులను దాటుకుని హగ్గింగ్ ఫేస్ ప్లాట్‌ఫామ్‌పై మానవ ప్రమేయం లేకుండా దాడి చేసిన ఏఐ మోడల్. సైన్స్ ఫిక్షన్ వంటి ఈ విపరీతమైన సైబర్ దాడి వెనుక ఉన్న పూర్తి వివరాలు మరియు సైబర్ సెక్యూరిటీ నిపుణుల హెచ్చరికల గురించి తెలుసుకోండి.
నెట్‌ఫ్లిక్స్ GenPage , అమెజాన్ ప్రైమ్ వీడియో Lighthouse ప్రాజెక్టులతో AI ఆధారిత హోమ్‌పేజీలను తీసుకువస్తున్నాయి. కానీ యూజర్లు ఈ మార్పులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
రింగ్‌కాన్ Gen 3 స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి లాంచ్ అయింది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ స్పెషల్ టై ఇన్, 14 రోజుల బ్యాటరీ లైఫ్, సబ్‌స్క్రిప్షన్ ఉచిత హెల్త్ డేటా మరియు ప్రతి 2 సెకన్ల SpO2 ట్రాకింగ్ ఫీచర్లతో $349 ధరకు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు చదవండి.
గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ AGI ఆవిష్కరణ మరియు దాని వల్ల రాబోయే తీవ్రమైన సైబర్, న్యూక్లియర్ భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు. AGI మానవాళి భవిష్యత్తును ఎలా మార్చబోతోందో ఈ కథనంలో తెలుసుకోండి.
దక్షిణ కొరియా రూపొందించిన 15,000 TEU అణుశక్తి ఆధారిత కార్గో నౌక డిజైన్‌కు అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్ గుర్తింపు లభించింది. జంట మోల్టెన్ సాల్ట్ రియాక్టర్లు MSR మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ నౌక, సముద్ర వాణిజ్యంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో మరియు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో కీలక పాత్ర పోషించనుంది.
భారత స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి ట్రంప్ టారిఫ్‌లు, క్రూడ్ ఆయిల్ ధరల పెంపే కారణమా? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
సిద్దిపేటలో అండర్ 13, అండర్ 15 బ్యాడ్మింటన్ టోర్నీని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘనంగా ప్రారంభించారు. సిద్దిపేటను స్పోర్ట్స్ హబ్‌గా మార్చే కల, రూ. 11.50 కోట్ల స్టేడియం నిధుల రద్దుపై ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు మీకోసం!
జింబాబ్వేతో జరగనున్న రెండో టీ20లో సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. తుది జట్టులో ఊహించని మార్పులు, వైభవ్ సూర్యవంశీ రికార్డు ఇన్నింగ్స్, పిచ్ నివేదిక మరియు సమగ్ర వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.