అవినీతి ఇఓ రామచంద్రమోహన్‌ బదిలీ?

Publish Date:Jul 12, 2012

Advertisement

గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే ప్రబుద్ధులు ఉంటారని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఇఓ రామచంద్రమోహన్‌ విధులను పరిశీలిస్తే అనుమానించక తప్పదు. అందుకే చేతివాటం తిరిగిన ఈయన్ని ప్రశాంతంగా తప్పించాలని భద్రాచలం బదిలీ చేశారట. పూర్తిగా దేవాదాయశాఖ నుంచి ఈయన్ని తప్పించారని సమాచారం. అయితే ఇఓ తాజాగా సక్రమంగా విధులకు హాజరుకాలేదని వంకపెట్టి 3వగ్రేడ్‌ వ్రతపురోహితుడు పోచినపెద్ది రాథాకృష్ణను సస్పెండ్‌ చేశారు. ఇఓ  తాను చేసిన తప్పులు కప్పిపుచ్చుకుని పేదబ్రాహ్మణుడిపై పడ్డాడేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగడిరచిన తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అవకతవకలపై ఇటీవల భారీగానే దుమారం లేస్తోంది. కొత్తగా ఆలయనిర్మాణం పూర్తి చేసిన ఇఓ బాగా లాభపడ్డారని ఆందోళనలు ఎక్కువయ్యాయి. అంతేకాకుండా తన భార్య, పిల్లల పేరిట వ్రతమండపాలు కట్టించేందుకూ ఈయన వెనుకాడలేదు. అంటే దాతల సొమ్ముతో తాను సోకు చేసుకుందామని ప్రయత్నించారు. అంతేకాకుండా లెక్కల్లో లేని విదేశీడబ్బును కూడా ఈయన కూడబెట్టారని ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి.

 

 

గతేడాది అమెరికా వెళ్లి భక్తుల నుంచి కొంత సొమ్ము ఈయన తన తాలూకూవారి అకౌంట్లలోకి లాగేశారని సమాచారం. అలానే నిర్మాణం వాస్తవ ఎస్టిమేట్లు కూడా ఎప్పుడో దాటించేశారని కూడా ఈయనపై ఆరోపణలున్నాయి. అయితే ఈయన్ని బదిలీ చేస్తున్నందుకు దేవస్థాన పురోహితులు, సిబ్బంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి కళ్యాణం వచ్చినా, ఇతర ఏ కార్యక్రమం చేపట్టినా ఆర్‌ఎన్‌ఐ కూడా లేని, అసలు నిబంధనల ప్రకారం వచ్చి ప్రకటన కూడా కలెక్ట్‌ చేయలేని పత్రికల పేరిట బిల్లులు కూడా చేసేశారని తెలిసింది. అంతేకాకుండా దేవస్థానంలో పెద్దగా అవసరం లేదని పాత ఇఓలు తొలగించిన పోస్టులను తిరిగి నియమించి గొప్పగా చూపే ప్రయత్నంలో ఇఓ విజయవంతమయ్యారని తెలిసింది. దానిలో భాగంగానే ఓ పిఆర్‌ఓ పోస్టును ఆయన గొప్పగా చూపుతున్నారు. ప్రతీపనికీ పిఆర్‌ఓను ముందు చూపుతున్నారు.



ఒకరకంగా ఇఓ రామచంద్రమోహన్‌ తనకు బదులుగా ఏజెంటుగా పిఆర్‌ఓను వాడుతున్నారని విమర్శలు ఎక్కువయ్యాయి. గురివింద గింజ ఎక్కిరింతలా ఆయన తన అథికారాన్ని చిన్న ఉద్యోగుల ముందు ప్రదర్శిస్తూనే వచ్చారు. ఇక వ్రతపురోహితుడు పోచిపెద్ది రాథాకృష్ణ అన్నవరంలో పురోహిత యూనియన్‌ కోసం డబ్బులు వసూలు చేశారట. దానిలో ఇఓగారి వాటా అందనందుకే ఆయన్ని సస్పెండ్‌ చేశారని, అలానే ఇఓ సొంతపనులకు రాథాకృష్ణ ఒకసారి నో అన్నందుకు ఈ సస్పెన్షన్‌ విధించారని సమాచారం. ఇంకా వేరే కారణం ఉన్నా ఉండొచ్చని ఆ దేవస్థానంలోని ఇతర ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. ఇలా ఇఓ ఇష్టానుసారంగా అన్నవరం దేవస్థానాన్ని వినియోగించుకుంటున్నారని ఆరోపణలు ఎక్కువయ్యాయి. మరి ఆయనపై చర్య తీసుకునేందుకు దేవాదాయశాఖ సిద్ధంగా ఉందా?

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.