Publish Date:Apr 23, 2026
ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్ కార్ట్ ( ఇటీవల ఒక అనూహ్య వివాదంలో చిక్కుకుంది. సంస్థకు చెందిన ఒక అంతర్గత శిక్షణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అది కాస్తా పెను వివాదానికి దారితీసింది. ముఖ్యంగా ఉద్యోగుల డ్రెస్ కోడ్‌లో కొన్ని మతపరమైన చిహ్నాలను అనుమతించి, మరికొన్నింటిని నిషేధించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అయిన ఆ స్టాఫ్ యూనిఫామ్ అండ్ గ్రూమింగ్ గైడ్ ప్రకారం.. పని ప్రదేశంలో ఉద్యోగులు నలుపు రంగు హిజాబ్ లేదా టర్బన్‌లను ధరించవచ్చనీ, అదే సమయంలో నుదుటిపై బొట్టు, తిలకం ధరించడం లేదా చేతికి రక్షాబంధనం (చేతి తాడు) వంటి దారాలను కట్టుకోవడం నిషేధమనీ ఆ పత్రంలో రాసి ఉండటం కలకలం రేపింది. అంతేకాకుండా.. వివాహిత మహిళలు పెట్టుకునే సిందూరం కూడా చాలా తక్కువగా ఉండాలని, అది కూడా నుదుటి మీద ఉండడానికి వీల్లేదనీ ఆంక్ష విధించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ నిబంధనలు బయటకు రావడంతో.. ఒక మత చిహ్నానికి ప్రాధాన్యతనిచ్చి, మరో మత సంప్రదాయాలను కించపరచడం సెలెక్టివ్ టార్గెటింగ్ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా లెన్స్ కార్ట్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడంతో.. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే సూచనలు కనిపించడంతో.. సంస్థ సీఈఓ పేయుష్ బన్సల్ రంగంలోకి దిగారు.ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ప్రచారంలో ఉన్న ఆ డాక్యుమెంట్ సంస్థ యొక్క ప్రస్తుత విధానాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు. అది ఒక పాత ఇంటర్నల్ డాక్యుమెంట్ అని పేర్కొన్న ఆయన అందులో ఉన్న తప్పులను ఫిబ్రవరిలోనే గుర్తించి తొలగించామని వివరణ ఇచ్చారు. లెన్స్ కార్ట్ భారతీయుల కోసం నిర్మించబడిన సంస్థ అని, ఇక్కడ మతపరమైన వ్యక్తీకరణలపై, ముఖ్యంగా బొట్టు లేదా తిలకంపై ఎటువంటి ఆంక్షలు లేవని క్లారిటీ ఇచ్చారు.
అయితే, సదరు డాక్యుమెంట్‌పై 2026 ఫిబ్రవరి తేదీ ఉండటంతో, సీఈఓ వివరణపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు కేవలం ప్రకటనల కోసమే డైవర్సిటీ అనే పదాన్ని వాడుతాయా లేక క్షేత్రస్థాయిలో ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాయా అనే చర్చ ఇప్పుడు న్యాయ, సామాజిక వర్గాల్లో మొదలైంది. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛకు, కార్పొరేట్ కంపెనీల బ్రాండ్ రూల్స్‌కు మధ్య ఉండాల్సిన సమతుల్యతపై ఈ ఘటన మరోసారి చర్చను రేకెత్తించింది. భవిష్యత్తులో ఇటువంటి సున్నితమైన అంశాలలో కంపెనీలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వివక్షకు తావు లేకుండా అన్ని సంప్రదాయాలను సమానంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
- సీతారాం కంఠంనేని
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-controversy-over-religious-symbols-in-corporate-work-culture-36-218081.html
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.